చింతమనేని, డ్రైవర్‌పై వైసీపీ వర్గీయుల దాడి
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:30 AM
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, అనుచరులు దాడి చేశారంటూ కేసు నమోదైంది.

మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అనుచరులపై కేసు
పెదవేగి/ఏలూరు క్రైం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, అనుచరులు దాడి చేశారంటూ కేసు నమోదైంది. వివరాలివి.. ఎమ్మెల్యే చింతమనేని వద్ద ఏలూరు కండ్రికగూడెంకు చెందిన మాను కొండ సుధీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమీపంలో వట్లూరు – సీతారామపురం రోడ్డులో పద్మావతి కన్వెన్షన్ హాలులో ఒక వివాహానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. డ్రైవర్ కారు వద్ద ఉన్నారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్‌చార్జి కొఠారు, ఆయన అనుచరులు కలిసి కారు అడ్డుపెట్టి డ్రైవర్‌పై దాడి చేశారు. ప్రశ్నించిన డ్రైవర్‌ను కులంపేరుతో దూషించి కొట్టారు. కొఠారు, ఆయన అనుచరులు చంపడానికి ప్రయత్నించారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొ న్నారు. అప్పుడే వచ్చిన ఎమ్మెల్యే ప్రభాకర్‌పైన దాడికి ప్రయత్నించారని అడ్డుకోబోయిన గన్‌మెన్ (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) వద్ద ఉన్న గన్ తీసుకుని కాల్చడానికి ప్రయత్నించా రని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రధాన నిందితుడిగా అబ్బయ్య చౌదరి, వేమూరి జితేంద్ర, జానంపేట బాబు, విజయ్‌బాబు, మట్టా ప్రవీణ్, పామర్తి వీర్రాజు, ఉప్పలపాటి సాయిరామ్‌చౌదరి, చల్లారి హేమంత్, పొన్నూరి నాగరాజు మరికొందరు దాడిలో పాల్గొన్నారని పేర్కొనడంతో వారందరి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దాడి విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి భారీగా చేరుకున్నారు. వైసీపీ వర్గీయులు కొఠారు అబ్బయ్యచౌదరి స్వగ్రామం కొండలరావుపాలెం చేరుకున్నారు. పోలీసులు ఈ గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, వివా దం పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఉద్దేశ పూర్వక దాడి : చింతమనేని
శుభకార్యం వద్ద కారు అడ్డుపెట్టి గొడవ పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం సిగ్గు చేటని ఎమ్మెల్యే చింత మనేని మండిపడ్డారు. గురువారం జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్‌ను కలసి నియోజకవర్గ పరిస్థితులను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివాహ వేడుక వద్ద అబ్బయ్య చౌదరి కారు అడ్డుపెట్టారని, అక్కడ ఉన్న సెక్యూరిటీ చెప్పినా కారు తీయకుండా ఉద్దేశ పూర్వకంగానే గొడవ పెట్టుకుని తన డ్రైవర్‌పై, తన గన్‌మెన్‌పై దాడికి దిగారని చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రవర్తిస్తున్నారని తప్పు చేసిన వారు ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిం చాల్సిందేనన్నారు. ఈ ఘటనపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని చెప్పారు. తప్పు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు.
కక్ష సాధింపు చర్యలు : కొఠారు
ఎమ్మెల్యే చింతమనేని తమపై కక్ష సాధింపు చ ర్యలకు పాల్పడుతున్నా రని మాజీ ఎమ్మెల్యే కొఠారు ఆరోపించారు. పెళ్లి వేడుక ఘటనపై గురువారం ఏలూరులో విలేకరులతో మాట్లా డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజు ల్లోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నా రని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా, టీడీపీ రాజ్యాంగ మా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు సమర్ధనీయం కాదని, ఇకనైనా చింతమ నేని తన ప్రవర్తనను మార్చుకోవాలని చెప్పారు.