పెట్రోల్ బంకులపై విజిలెన్సు దాడులు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:26 AM
ఏలూరు, భీమవరాలలో శనివారం విస్తృతంగా పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు.

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) :విజిలెన్సు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐలు పి.శివరామకృష్ణ, డి .ప్రసాద్‌కుమార్, ఎస్‌ఐ కె సీతారామ్ వారి సిబ్బంది కలిసి ఏలూరు, భీమవరాలలో శనివారం విస్తృతంగా పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఏలూరులోని మెస్సర్స్ శ్రీమౌర్య ఫ్యూయల్స్, మెస్సర్స్ పార్వతీ ఎనర్జీ స్టేషన్, భీమవరంలో మెస్సర్స్ పృథ్వీ ఫిల్లింగ్ స్టేషన్, మెస్సర్స్ పుష్ప సర్వీసెస్ సెంటర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వలను తనిఖీలు చేశారు. అగ్ని మాపక ని యంత్రణ పరికరాలు, డెన్సిటీ కొల తల తేడాలు, స్టాక్ బుక్‌లో తేడాలు, ఇన్‌వాయిస్ బిల్లులను తనిఖీలు చేశారు. పెట్రోల్ బంకులలో చిప్‌లు ఏమైనా అమర్చారా అని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మెస్సర్స్ పుష్పా సర్వీసెస్ సెంట్రల్ 16 నాజల్స్ తనిఖీలు చేయగా అందులో ఒక నాజల్‌లో ఐదు లీటర్ల ప్రామాణిక కొలతకు 30 మిల్లీ లీటర్ల తక్కువ పరిమాణం వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఎల్‌ఎంయాక్టు 2009 ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిం దన్నారు. ఎవరైనా పెట్రోల్ బంకుల్లో అక్రమా లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.