Share News

స్నేహితుల కొట్లాట.. ఒకరి మృతి

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:47 PM

పాత గొడవను పురస్కరించుకుని మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది.

స్నేహితుల కొట్లాట.. ఒకరి మృతి

మద్యం మత్తులో గొడవ

హత్య కేసు నమోదు

అత్తిలి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పాత గొడవను పురస్కరించుకుని మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు, స్ధానికుల కథనం మేరకు అత్తిలి మండలం దంతుపల్లి గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు (35) కొబ్బరికాయల దింపు పనికి వెళుతుంటాడు. అదే గ్రామానికి చెందిన కడలి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకట నారా యణ, జుత్తిగ వీరాంజనేయులు స్నేహితులు. వీరిద్దరు కలిసి తరచు మద్యం సేవిస్తూ ఉం టారు. ఆరు నెలల క్రితం వీరాంజనేయులు, అతని స్నేహితుడు వెంకటేశ్వరరావు కుడి చెవి వద్ద కత్తితో గాయం చేశాడు. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు కక్ష పెంచుకున్నాడు. మంగళ వారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కలిసి మహంకాళమ్మ ఆలయం వద్ద బల్లపై కూర్చుని మద్యం సేవించారు. ఈ సమయంలో పాత గొడవను పురస్కరించుకుని ఇద్దరు ఘర్షణ పడ్డారు. కడలి వెంకటేశ్వరరావు రాయితో వీరాం జనేయుల తల, ముఖంపై కొట్టి పక్కనే ఉన్న పంట కాలువలో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి సమయానికి వీరాంజనేయులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంకటేశ్వర రావును నిలదీయగా తానే రాయితో కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్తిలి ఎస్‌ఐ పి ప్రేమ రాజు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఒక కుమార్తె ఉన్నారు. భార్యభర్తల గొడవలతో భార్య రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. వెంకటేశ్వరరావు అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడని తెలిసింది. మృతుడి సోదరి మట్టపర్తి మంగాయమ్మ ఫిర్యాదు మేర కు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని ఎస్‌ఐ పి.ప్రేమరాజు తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో యువతి మృతి

బుట్టాయగూడెం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పదస్థితిలో యువతి మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని బురుగువాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొడ్డ రేఖ మాధవి(22) బుధవారం బురుగువాడలోని తన ఇంటిలో ఉరి వేసుకుని మరణించింది. ఆమెకు 8 నెలల క్రితం బొడ్డ పండు సాయికిరణ్‌తో వివాహం జరిగింది. రేఖమాధవి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్‌ డిగ్రీ చదువుచుండగా సాయికిరణ్‌ వెటర్నరీ పూర్తిచేసి ఖాళీగా ఉంటు న్నాడు. యువతి మృతి సమాచారం అందుకున్న జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరావు, బుట్టాయగూ డెం ఎస్సై దుర్గా మహేశ్వరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరి యా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి మందలించిందని.. కొడుకు ఆత్మహత్య

ముదినేపల్లి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): స్నేహితులతో తిరగడం మాని కూలి పనులకు వెళ్లమని తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో జరిగింది. కటికల నాగబాబు (18) కొంత కాలంగా కూలి పనుల కు వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. మంగళ వారం రాత్రి అతని తల్లి కుమారుడిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన నాగబాబు ఎలుకలు మందు మింగి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. నాగబాబు మృతదేహానికి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి కేసు నమోదు చేసి ఎస్‌ఐ వీరభద్రరావు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:47 PM