చేపలు పట్టడానికి వెళ్లి.. అన్నదమ్ములు దుర్మరణం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:55 AM
మండలంలోని తుమ్మగూడెంలో గురువారం చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు మొలుగుమాటి చంద్రశేఖర్(30), విజయకుమార్(27) నీటిలో మునిగి మృతి చెందారు.

చెరువులో మునిగిన తమ్ముడు
రక్షించబోయిన అన్న కూడా మృతి
తుమ్మగూడెంలో విషాదం
చాట్రాయి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుమ్మగూడెంలో గురువారం చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు మొలుగుమాటి చంద్రశేఖర్(30), విజయకుమార్(27) నీటిలో మునిగి మృతి చెందారు. వ్యవసాయ పనులకు వెళ్లివచ్చిన అన్నదములు మధ్యాహ్నం నుంచి జయపురం చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. చేపలు పడుతుండగా విజయకుమార్ నీటిలో మునిగి పోతుండడంతో తమ్ముడిని రక్షిం చడానికి చంద్రశేఖర్ నీటిలో దూకాడు. ఇద్దరు మునిగిపోతుండటంతో అక్కడే చేపలు పడుతున్న కొంతమంది రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతిదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. అన్నదమ్ములు మృతి చెందటంతో తుమ్మగూడెం శివారు బిల్డింగ్‌గూడెంలో విషాదం నెలకుంది. అన్నదమ్ముల మృతదేహాలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతులు చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, విజయకుమార్‌కు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. సర్పంచ్ మారె మ్మ, స్థానిక నాయకులు మందలపు రాజారావు, మాదల నరసింహారావు మృతుల కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
విద్యుదాఘాతంతో షిఫ్ట్ ఆపరేటర్ మృతి
కామవరపుకోట, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పామాయిల్ తోటలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పనులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ విద్యు దాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందా డు. తడికలపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్ళచెరువు పంచాయతీ పాతగండి గూడెం గ్రామానికి చెందిన గండిబోయిన రాజు (29) విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఉన్న తాధికారులకు తెలియచేసి విద్యుత్ సరఫరా నిలిపి పనులు చేస్తున్నాడు. అదే సమయంలో ఆకస్మికంగా విద్యుత్ సరఫరా కావడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. తడికలపూడి పోలీ సులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సంఘ టనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రాజుకు అదే గ్రామానికి చెందిన స్వాతితో గత నెల 1న వివాహమైంది. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివాహ మైన నెల రోజులకే యువకుడు మృత్యువాత పడడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేవీపీఎస్ జి ల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా షిఫ్ట్ ఆపరేటర్ దుర్మరణం చెందాడని, ఆ కుటుంబా నికి రూ.20 లక్షల నష్టపరిహారం అందజే యాలని, ఆ కుటుంబంలోని వారికి ఉద్యోగావ కాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇంటి పని చేస్తుండగా..
భీమవరం క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇంటి పని చేస్తుండగా ఒక తాపీ వర్కర్ విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్‌ఐ రెహ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన మహం తి గోవిందరావు (37) గొల్లవానితిప్ప రోడ్డులో తాపీ పని నిమిత్తం బుధవారం వెళ్లాడు. అక్కడ డ్రెయినేజీపై రాళ్లు పరుస్తూ ఉండగా అతనికి కరెంట్ తీగ తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే అంబులెన్స్‌లో భీమవరం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోవిందరావు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గోవిందరావు భార్య ఇందువదన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రెహ్మాన్ తెలిపారు.
లారీ ఢీకొని ఒకరి మృతి
ఆకివీడు రూరల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): దుంపగడపలోని శ్రీచైతన్య స్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో మద్దా మరియదాసు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకివీడు ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాలు మేరకు ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెదకొ ట్టాడకు చెందిన మద్దా మరియదాసు (38) ఫిష్ ప్యాకిం గ్ పనులు చేస్తుంటాడు. అతడికి భార్య ముగ్గురు కుమారులున్నారు. గురువారం తన తోడల్లుడు కుమారుడు దిన కార్యక్రమానికి అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళుతుండగా కైకలూరు నుంచి ఆకివీడు వైపు వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో మరియదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. ఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని ఒకరు..
ఏలూరు క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టి.నరసాపురం మండలం కొల్లివారిగూడెంనకు చెందిన నంద మూరి గంగాధరరావు (44) బుధవారం రాత్రి ఏలూరు కొత్త బస్టాండ్ వెనుక రైలు పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలూ రు రైల్వే ఎస్‌ఐ పి.సైమన్‌కు సమాచారం అంద డంతో తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
బాలుడి అనుమానాస్పద మృతి
ఏలూరు క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పద్నాలుగేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చింతల పూడి ప్రభుత్వ హైస్కూలులో అటెండర్‌గా పనిచేస్తున్న బంగారు శివకు భార్య అనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కృష్ణ వర్ధన్ ఐటీఐ చదువుతున్నాడు. రెండో కుమారుడు అయిన బంగారు యశ్వంత్‌కుమార్ (14) ఏడవ తరగతి చదివి ఖాళీగా ఏలూరు చేపల తూము సెంటర్‌లో నానమ్మ వద్ద ఉంటున్నాడు. ఈనెల 5న సాయంత్రం తనకు అనారోగ్యంగా ఉందని యశ్వంత్‌కుమార్ సోదరు డు కృష్ణవర్ధన్‌తో చెప్పి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో పెదవేగి మండలం మొండూరు సమీపంలోని పోలవరం కాలువ గట్టు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళుతున్న వారు అంబులెన్స్‌కు సమా చారం ఇచ్చి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అత్యవసర విభాగపు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి మృత దేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. యశ్వంత్‌కుమార్ మృతదేహం మార్చురీలో ఉందన్న సమాచారం తెలిసిన కుటుంబ సభ్యు లు గురువారం ఉదయం ఏలూరు ప్రభుత్వాసు పత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. సీసీఎస్ పోలీసులు మోటారు సైకిల్ దొంగతనాల కేసులో యశ్వంత్‌కుమార్‌ను తీసుకువెళ్లా రని వారే ఏదో చేసి ఉంటారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించి ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
అతని సోదరుడు కృష్ణవర్ధన్ మాత్రం తన తమ్ముడు యశ్వంత్‌కుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాలుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు రాత పూర్వకంగా పోలీసులకు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.