గీత కార్మికుల మద్యం షాపులకు స్పందన అంతంతే..
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:15 AM
కల్లు గీత కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

జిల్లాలో 18 షాపులకు 101 దరఖాస్తులు
కమీషన్ 14 శాతానికి పెంపు
ఉత్తర్వుల జారీకి కసరత్తు
దరఖాస్తులు పెరిగే అవకాశం
రేపు లైసెన్స్‌ల కేటాయింపు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
కల్లు గీత కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కూటమి ప్రభుత్వం హామీ మేరకు జిల్లాలో కల్లు గీత వృత్తిదారులకు 10శాతం దుకాణాలు కేటా యించారు. 18 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటివరకు 101 దరఖాస్తు లు అందాయి. ప్రైవేటు మద్యం దుకాణంలో గిట్టుబాటు కాదని గీత వృత్తిదారులు ఆచి తూచి అడుగు వేస్తున్నారు. ఒక్కో దుకాణా నికి సగటున 6 దరఖాస్తులు అందకపోవడం తో అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 175 దుకాణాల లైసెన్స్‌కు దరఖా స్తులు ఆహ్వానించిన సమయంలో ఒక్కో దుకాణానికి సగటున 25 దరఖాస్తులు అం దాయి. ఈ లెక్కన గీత వృత్తిదారుల దుకా ణాలకు 500 దరఖాస్తులు రావచ్చని అంచ నా. గతంలో షాపులు దక్కించుకున్న లైసెన్స్ దారులు నష్టాలు వస్తున్నాయని గగ్గోలు పెట్టడంతో ఆ ప్రభావం గీత కార్మికుల షాపులపై పడిందని భావిస్తున్నారు.
నేటితో ముగియనున్న గడువు
కల్లు గీత వృత్తిదారులకు కేటాయించిన షాపులకు దరఖాస్తు చేసుకోడానికి శనివారం ఒక్కరోజు గడువు ఉంది. ఈ నెల 9న షాపులను కేటాయించనున్నారు. ప్రభుత్వం 14శాతానికి కమీషన్ పెంచడంతో మరో రోజు వ్యవధిలో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉం దని అధికారులు భావిస్తున్నారు. వ్యాపారుల్లో మాత్రం పెద్దగా కదలిక లేదు. కమీషన్ రావ డం లేదంటూ ఇది వరకే షాపులు దక్కించు కున్న లైసెన్స్‌దారులు లబోదిబో మంటు న్నారు. మరోవైపు మద్యం ధరలు తగ్గించ డం, ప్రైవేటుపరం చేయడంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గింది.
కమీషన్ 14 శాతం
ప్రైవేటు మద్యం దుకాణాల్లో సిట్టింగ్‌కు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు 20శాతం కమీషన్ ఇస్తా మని ప్రకటించింది. డిస్టిలరీల నుంచి సరఫ రా అయిన బాటిళ్లపైనే 20శాతం ఇస్తున్నారు. డిపోల నుంచి ఇచ్చే ధరకు ఇస్తే లాభసాటి గా ఉండేది. డిస్టిలరీల నుంచి డిపోలకు తక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుంది. దానిపై 20శాతం ఇస్తుండడంతో లైసెన్స్‌దా రులకు నష్టం వస్తోంది. షాపుల్లో అమ్మకాల పై 9 నుంచి 10 శాతమే కమీషన్ వస్తుందని ఘొల్లుమంటున్నారు. ప్రైవేటు మద్యం షాపు లు కేటాయించి 3 నెలలు దాటినా ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు కల్లు గీత వృత్తిదారుల షాపులపై పడింది. ప్రభు త్వం ఇచ్చిన మాట ప్రకారం కమీషన్ ఇవ్వ డానికి ముందుకొచ్చింది. రాష్ట్ర మంత్రి మం డలిలో ఆ మేరకు ఆమోదించడంతో ఉత్త ర్వులు వెలువడనున్నాయి. అదే జరిగితే లైసెన్స్‌దారులు గట్టెక్కనున్నారు. ప్రైవేటు మద్యం షాపులపై లాభాలు వస్తాయని గ తంలో ఎగబడ్డారు. ఒక్కో షాపు దక్కించు కోవడానికి రూ.50 లక్షల వరకు వెచ్చించారు. మరోవైపు ఏటా పల్లెల్లో షాపులకు రూ.55 లక్షలు, పట్టణాల్లో షాపులకు రూ. 65 లక్షల వంతున లైసెన్స్ రుసుము చెల్లించాలి. దాని కితోడు సిట్టింగ్‌లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్న ఉద్దేశంతో అన్ని హంగులున్న షాపులను అద్దెకు తీసుకున్నారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నెల అద్దె రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు లైసెన్స్‌దారు లపై ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.
బెడిసికొట్టిన సిండికేట్ వ్యూహం
సిండికేట్ అయితే నష్టాలనుంచి కొంత వరకు గట్టెక్కవచ్చని లైసెన్స్‌దారులు భావిం చారు. పట్టణాలు, మండలాల పరిధిలో సిం డికేట్ అయినా ఫలితం లేదు. ఎంఆర్‌పీ కంటే అదనంగా విక్రయించే వెసులుబాటు ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధిక మొత్తంలో విక్రయాలు సాగిస్తుంటే ఇక్కడ ప్రభుత్వం ఎంఆర్‌పీ కఠినంగా ఉంది. అదనపు ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేస్తోంది. బెల్ట్ షాపులపై కేసులు నమోదు కావడంతో లైసెన్స్‌దారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కమీషన్ పెరుగుదల కార్యరూపం దాలిస్తే లైసెన్స్‌దారులకు భారీ ఊరట లభించనుంది.