Share News

నేడు పెనుగొండకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:41 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీ సమేతంగా శుక్రవారం పెను గొండ రానున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

 నేడు పెనుగొండకు సీఎం చంద్రబాబు
సీఎం దిగే హెలీప్యాడ్‌ను తనిఖీ చేస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌

వాసవీ మాతకు సతీ సమేతంగా పట్టువస్ర్తాల సమర్పణ.. అధికారులు ఏర్పాట్లు పూర్తి

పెనుగొండ/ఆచంట, జనవరి 30(ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీ సమేతంగా శుక్రవారం పెను గొండ రానున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీప కాంతులతో మెరిసిపోతోంది. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజులుగా కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీమ్‌ అస్మి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్యకా పరమేశ్వరి, వాసవి ధామ్‌ ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.

సీఎం టూర్‌ షెడ్యూల్‌

ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.05 గంటలకు పెనుగొండ ఏఎంసీ లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

11.05 నుంచి 11.10 వరకు హెలీప్యాడ్‌ వద్ద ప్రజలను కలుసుకుంటారు.

11.15 గంటలకు రోడ్డు మార్గంలో కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంటారు.

11.45 వరకు ఆలయంలో ఉంటారు.

11.50 గంటలకు వాసవి ధామ్‌కు చేరుకుంటారు.

12.15 ఏఎంసీలోని హెలీప్యాడ్‌కు బయలు దేరతారు.

12.20 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి ఉండవల్లికి పయనమవుతారు.

Updated Date - Jan 31 , 2025 | 12:42 AM