బంగారం షాపునకు కన్నం వేసి..
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:37 AM
బంగారం షాపునకు కన్నం వేసిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.75 లక్షల విలువైన వెండి, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు.

గోడను తొలచి.. భారీ సొత్తు అపహరణ
అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు.. రూ.75 లక్షల వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): బంగారం షాపునకు కన్నం వేసిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.75 లక్షల విలువైన వెండి, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. జనవరి 11వ తేదీ అర్ధరాత్రి ఏలూరు మెయిన్ బజార్‌లోని లోకేశ్వరి జ్యూవెలర్స్ అండ్ బ్యాంకర్స్ బంగారు షాపు గోడకు రంధ్రం చేసి వెండి, బంగారు ఆభరణా లు అపహరించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున చొదిమెళ్ళ రోడ్డు పక్కన పొలాల్లో అనుమానాస్పదంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కుల్‌దీప్ శర్మ (24), మనోజ్ కుమార్ (35), మహేందర్‌సింగ్ (24), రాజేష్ కుసువాహ(టిటు) (39) అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారే ఈ దొంగ తనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. వీరంతా ఏలూరులో ఉంటున్నారు. వీరందరూ గతంలో వివిధ నేరాల్లో జైలు శిక్షలు అనుభవిం చిన సమయంలో పరిచయమై ముఠాగా ఏర్పడి వివి ధ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడు తున్నారు. రాజేష్ ఏలూరులో బంగారపు వస్తువులు తయారు చేసే షాపులో పనిచేస్తున్నాడు. ఆ ముగ్గురు నేరస్తులతో పరిచ యం ఏర్పడడంతో తరచుగా వారు ఇతని వద్దకు వచ్చి ఉంటు న్నారు. ఈ నేపథ్యంలో 2022లో వీరు ఏలూరు నగరంలో పలు దొంగత నాలకు పాల్పడ్డారు. ఈ ముఠాతోపాటు మరో నేరస్తుడు ఉన్నట్లుగా గుర్తించారు. అతనిని అరెస్టు చేయడానికి చర్యలు చేపట్టారు. నింది తుల నుంచి 469 గ్రాముల బంగారం, 41 కేజీల వెండి వస్తువు లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.