పరిహారం అందిందా..?
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:27 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపుబారిన పడుతున్న గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

41.15 కాంటూరు లెవెల్ గ్రామాల్లో ప్రారంభమైన సర్వే
కుక్కునూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపుబారిన పడుతున్న గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. తొలి దశలో కుక్కునూరు మండలంలో 8గ్రామాలు, వేలేరుపాడు మండలంలోని 17గ్రామాలకు వ్యక్తి గత పునరావాస పరిహారం, ఇళ్లకు పరిహారం, పునరావాస కాలనీలో ఇళ్లు కేటాయించడం, ఇల్లు వద్దనుకున్న వారికి స్థలం కేటాయించడం, ఇల్లు, స్థలం రెండు వద్దనుకున్న వారికి రూ.385 వేలు సొమ్ము జమ చేయడం, 2017 కట్ ఆఫ్ తేదీ ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతకు పునరా వాస పరిహారం జమ చేయడం, భూములకు పరిహారం చెల్లించడం జరిగింది.
కొంత మందికి బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం, ఇతరేతర కారణాల వలన పూర్తి స్థాయిలో ఏదొక పరిహారం పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో 41.15కాంటూరు లెవెల్ గ్రామాల్లో నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో తొల గించడానికి ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టిం ది. ఏ పరిహారం పెండింగులో ఉందో తెలుసుకో డానికి సర్వే చేపట్టారు. కుక్కునూరు ఏ బ్లాక్‌లో రెవెన్యూ సిబ్బంది గురువారం నిర్వాసితుల ఇంటికి వెళ్లి వారికి ఏ పరిహారం పెండింగ్ ఉందో నమోదు చేసుకుంటున్నారు. 41.15 కాంటూరు లెవెల్‌లో ఉన్న అన్ని గ్రామాల్లో సర్వే చేయనున్నారు. జంగారెడ్డిగూడెం మండ లం తాడువాయి పంచాయతీ చల్లావారిగూ డెంలో గిరిజనేతర నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ళు ప్లాట్లు వాటి వివరాలు నమోదు చేసుకుం టున్నారు. ఈ సర్వే ప్రక్రియ పూర్తయితే ఎవరె వరికి ఏసమస్య పెండింగ్ ఉందో తేలనుంది.
ఈ ఏడాది జనవరిలో కుక్కునూరు, వేలేరు పాడు మండాలంలోని నిర్వాసితులకు దాదాపు రూ.850కోట్లు పరిహారం నిర్వాసితుల ఖాతాలో జమ చేసింది. అయినప్పటికి మాకు పరిహారం పెండింగ్‌లో ఉందంటూ నిర్వాసితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గ్రామసభలు కూడా నిర్వహించారు. వేలాది దరఖాస్తులు రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇంటింటా సర్వేతో ఆ సమస్యను పూర్తి స్థాయిలో తెలుసుకుని పరిష్కరించే అవకాశం ఉంది. ఈ సర్వే మొత్తం పూర్తయితే నిర్వాసితులను పున రావాస కాలనీలకు తరలించడానికి ప్రభుత్వ యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. కుక్కునూరు వేలేరుపాడు మండ లాల్లో 41.15కాంటూరు లెవెల్ 25 గ్రామాలకు సంబంధించి 7001 గిరిజన, గిరిజనేతర నిర్వాసి తులు ఉన్నట్లు సమాచారం. రాబోయే వర్షాకా లం సీజన్‌నాటికి నిర్వాసితులను తరలించే ప్రక్రియ జరుగుతుందని ప్రచారం సాగుతోంది.
నిర్వాసితులకు న్యాయం చేయాలి
మంత్రి నిమ్మలకు వినతి
వేలేరుపాడు, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ప్రభుత్వ నిర్వాకం, అధికారుల అవినీతి కారణంగా పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరిగిందని గత తప్పిదాలను సరిచేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ కోరారు. టీడీపీ నాయకుల బృందం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును గురువారం విజయవాడలో కలిసి నిర్వాసితుల సమస్యలపై విన్నవించారు. నాన్‌లోకల్ కారణం గా కొందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జాబితా నుంచి తొలగించారని, చనిపోయిన వారి కుటుం బానికి ప్యాకేజీ చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం సుమారు 350 మందిని జాబితా నుంచి తొల గించారని, వారసులులేరని తప్పుడు నివేదిక ఇచ్చారని మంత్రికి తెలిపారు. టీడీపీ సానుభూ తిపరులను 350 మందికి పైగా జాబితా నుంచి తొలగించారన్నారు. కూటమి ప్రభుత్వం గత నెల 3న నిర్వాసితుల ఖాతాలకు ఆర్ అండ్ ఆర్ పరి హారం ఖాతాలకు జమ చేసిందని కొన్ని సాంకే తిక కారణాల వలన సుమారు 650 కుటుంబా లకు అందలేదన్నారు. 18ఏళ్లు నిండిన వారి విష యంలో నిర్ణయించిన కట్‌ఆఫ్ డేట్‌ను సవరించి, తరలించే నాటికి 18ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇప్పించాలని మంత్రిని కోరారు. ఏ ఒక్క నిర్వా సితునికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిమ్మల హామీ ఇచ్చా రన్నారు. మంత్రిని కలిసిన వారిలో వాసిరెడ్డి జగన్, జాగర్లమూడి శ్రీకాంత్, చందా కనకారావు, తదితరులు ఉన్నారు.