పరపతి పాయే..!
ABN , Publish Date - Feb 06 , 2025 | 01:18 AM
గత టీడీపీ హయాంలో గుర్తించిన లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వం తొలగిం చింది. నాలుగు పట్టణాల్లోనూ లబ్ధిదారుల జాబితాను వడిబోసింది.
నిరర్ధక ఆస్తులుగా చేర్చిన బ్యాంకులు
లబ్ధిదారులపై ఒత్తిళ్లు.. వాయిదాలు చెల్లించాలంటూ ఫోన్‌లు
లబోదిబోమంటున్న బాధితులు
జగన్ హయాంలో పట్టించుకోని ప్రభుత్వం
నిధులు దారి మళ్లింపు.. కాంట్రాక్టర్లకు బకాయిలు
గత టీడీపీ హయాంలో గుర్తించిన లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వం తొలగిం చింది. నాలుగు పట్టణాల్లోనూ లబ్ధిదారుల జాబితాను వడిబోసింది. 2,500 మందిని తొలగించింది. కొత్త వారికి అవకాశం కల్పించింది. లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు. ఇప్పటికీ మున్సిపాలిటీల చుట్టూ వారంతా తిరుగుతున్నారు. ప్రభుత్వానికే లబ్ధిదారుల సొమ్ము చెల్లించామంటూ మున్సిపాలిటీలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా అనర్హులుగా గుర్తించి జిల్లాలో వందల మందిని గత వైసీపీ ప్రభుత్వం దొంగ దెబ్బ తీసింది.
భీమవరంలో లక్ష్మి అనే మహిళకు
అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇల్లు కేటాయించారు. వైసీపీ హయాంలో రుణం మంజూరుచేశారు. అయితే ఇల్లు అప్పగించలేదు. కాని, బ్యాంకు నుంచి మాత్రం వాయిదాలు చెల్లించాలంటూ ఫోన్‌లు వస్తున్నాయి. ఇల్లు అప్పగించకుండా రుణం ఎలా చెల్లిస్తామంటూ చెబుతున్నా బ్యాంకు అధికారులు వినడం లేదు. అవసరా నికి బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి రుణం తీసుకుందామని వెళితే ఇవ్వలేదు. ఏ బ్యాంకుకు వెళ్లినా అప్పు దొరకలేదు. ఇంటి రుణం చెల్లిస్తేనే ఇతర లోన్‌లు ఇస్తామంటూ స్పష్టం చేస్తున్నాయి. ఇలా బ్యాంకుల వద్ద లక్ష్మి పరపతి కోల్పోయారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఇటువంటి బాధితులు ఎందరో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజనలో మంజూరు చేసిన అర్బన్ హౌసింగ్ అభాసుపాలవుతోంది. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో అర్బన్ హౌసింగ్ పథకాన్ని అమలు చేసింది. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ నగర్ పేరుతో టిడ్కో ఇళ్లను ప్రారంభించింది. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లోనే 75 శాతం నిర్మాణం పూర్తయ్యింది. తర్వాత వైసీపీ అధికారం లోకి వచ్చింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వేగం తగ్గింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదు. తణుకులో ఇంటి నిర్మాణాన్ని నిలిపి వేయాలంటూ స్పష్టం చేసింది. మిగిలిన మూడు పట్టణాల్లో ఏజన్సీ నిర్మాణాలు చేపట్టలేదు. ప్రభుత్వం నుంచి బకా యిలు చెల్లింపులు నిలిచిపోవ డంతో ఏజన్సీ ముఖం చాటే సింది. పనులు చేపట్టలేదు. మూడేళ్లు గడచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచింది. బ్యాంకుల నుం చి టిడ్కో లబ్ధిదారులకు రుణాలు అందజేసింది.
ఇళ్లు అప్పగించే వరకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని చెప్పుకొ చ్చింది. జిల్లాలో పది వేల మంది టిడ్కో లబ్ధిదారులకు రుణాలు ఇచ్చారు. దాదాపు
రూ.300 కోట్లు మంజూరుచేశారు. ఏజెన్సీకి మాత్రం పూర్తిస్థాయిలో సొమ్ములు చెల్లించలేదు. వైసీపీ ప్రభుత్వం వాటిని దారి మళ్లించింది. ఫలితంగా ఇప్పటికీ ఇళ్లు పూర్తికాలేదు.
ఆందోళనలో లబ్ధిదారులు
బ్యాంకుల నుంచి రుణాలు పొందిన లబ్ధిదారులు ఆందో ళన చెందుతున్నారు. ఇళ్లు అప్పగించకపోవడంతో బ్యాంకు వాయిదాలు చెల్లించలేదు. దీంతో సిబిల్ పాయింట్‌లు పడిపో యాయి. ఇతర రుణాల కోసం బ్యాంకులకు వెళు తుంటే సిబిల్ స్కోర్ చూస్తున్నారు. అప్పు ఇవ్వలే మంటూ తేల్చి చెబుతున్నారు. చివర కు సూక్ష్మ ఫైనాన్స్ సంస్థలు వ్యక్తిగత రుణా లు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఇలా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదానికి టిడ్కో లబ్ధిదారులు పరపతి కోల్పోయారు. ఇళ్లకు నోచుకోలేదు. మెడపై అప్పు కత్తి వేలాడుతోంది. మున్ముందు మరింత మంది ఎన్‌పీఏ జాబితాలో చేరనున్నారు. ప్రభుత్వం రెండేళ్ల వ్యవధి విధిం చింది. ఆ తర్వాత వాయిదాలు చెల్లిస్తారని బ్యాంకులకు హామీ ఇచ్చింది. అప్పటిదాకా వడ్డీ చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో వేల మంది లబ్ధిదారులకు రెండేళ్ల వ్యవధి పూర్తికానుంది. వారు ఎన్‌పీఏ జాబితాలో చేరిపోనున్నారు.
ప్రభుత్వానికి నివేదిక
టిడ్కో లబ్ధిదారులు రుణాలు చెల్లించకపోవడంతో అధికా రులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. జిల్లాలో నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలో చేరిన లబ్ధిదారుల జాబితాను కూటమి ప్రభుత్వానికి చేరవేశారు. భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు పట్టణాల్లోనూ ఎన్‌పీఏ జాబితా లో చేరిన లబ్ధిదారులు వున్నారు. వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఓ వైపు ఇల్లు లేక మరోవైపు బ్యాంకులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇంకోవైపు లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించిన సొమ్ము లకు వడ్డీ చెల్లిస్తున్నారు. అప్పులు తెచ్చి తమ వంతుగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించారు. సదరు అప్పును తీర్చడానికి ఆపసోపాలు పడుతున్నారు.
ఎన్‌పీఏ లబ్ధిదారులు ఇలా..
మున్సిపాలిటీ మంజూరైన అప్పగించిన ఎన్‌పీఏలో
ఇళ్లు ఇళ్లు చేరినవి
భీమవరం 8,352 1,984 1,090
పాలకొల్లు 6,784 2,560 1,032
తాడేపల్లిగూడెం 5,672 3,232 150
తణుకు 1,200 0 412