Share News

బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలిగా శ్రీదేవి

ABN , Publish Date - Jan 22 , 2025 | 01:07 AM

బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా అయినంపూడి శ్రీదేవి ఎన్నికయ్యారు.

బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా  అధ్యక్షురాలిగా శ్రీదేవి
శ్రీదేవిని అభినందిస్తున్న కేంద్ర మంత్రి వర్మ

భీమవరం టౌన్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా అయినంపూడి శ్రీదేవి ఎన్నికయ్యారు. మంగళవారం భీమవ రం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బీజేపీ సిద్దాంతాల ప్రకారం జిల్లా అధ్యక్ష పదవిని ఈసారి మహిళలకు కేటాయించినట్లు ప్రకటించారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అభి ప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీదేవి ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎన్నిక ధ్రువీక రణ పత్రాన్ని శ్రీదేవికి అందించి అభినందించారు. పార్టీ ఎన్నికల పరిశీలకుడు అయ్యా జీ వేమా, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ పాకా వెంకటసత్యనారాయణ, బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనచౌదరి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కురెళ్ల నర్సింహరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కపర్థి పాల్గొన్నారు

పార్టీలో శ్రీదేవి ప్రయాణం

శ్రీదేవి భర్త ఐనంపూడి రామ రాజు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2010లో తణుకులో బాబా డిజిటల్‌ ల్యాబ్‌ను ఏర్పాటుతో ఆమె బాబా మేడంగా అందరికీ సుపరిచితులు. 2012లో అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, పైడికొండల మాణిక్యాలరావు, కోడూరి లక్ష్మీనారాయణ, టీవీఎస్‌ వర్మ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. 2012లో మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా, 2013లో బేటీ బచా వో, భేటీ పడావో రాష్ట్ర కన్వీన ర్‌గా, 2015లో మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీగా, 2021లో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా, 2023లో బీజేపీ తణుకు నియోజవర్గ కన్వీ నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 తణుకు ఏరియా ఫొటో స్టూడియో సంఘ అధ్యక్షురాలిగా, 2020లో తణుకు రోటరీ క్లబ్‌ అధ్యక్షురాలిగా, ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 01:07 AM