తల్లీ బిడ్డలకు ఆరోగ్యం
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:32 AM
మహిళకు మాతృత్వం ఓ వరం. ప్రతి గర్భిణీ క్షేమంగా బిడ్డను కనాలని కుటుంబ సభ్యులు కలలు కంటారు.

తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఆసుపత్రుల్లో కేంద్రాల ఏర్పాటు
గతంలో నిధులు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
తిరిగి కూటమిలో కదలిక
నిర్మాణ పనులు వేగవంతం
మార్చిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం
కాంట్రాక్టర్‌కు బకాయిల చెల్లింపు
మహిళకు మాతృత్వం ఓ వరం. ప్రతి గర్భిణీ క్షేమంగా బిడ్డను కనాలని కుటుంబ సభ్యులు కలలు కంటారు. చేతిలో డబ్బు లేని పరిస్థితిలో నెలలు నిండిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే దిక్కుతోచదు. ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతుంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇతర సేవలు ఎలా ఉన్నా ప్రశూతి విభాగానికి డిమాండ్ ఉంటుంది. గర్భిణులు అత్యధికంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో దాదాపు 50శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తున్నారు. తల్లీ బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీటవేస్తుంది. డెలివరీ అయిన తర్వాత తల్లీ బిడ్డలను ప్రభుత్వ అంబులెన్స్‌లో ఇంటికి చేరవేస్తున్నారు. మూడో నెలనుంచే గర్భిణీ ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. ప్రతినెలా క్రమం తప్పకుండా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకునేలా చర్య లు తీసుకుంటోంది. మందులను ఉచితంగా ఇస్తోంది. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఆధారప డుతున్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు మాతా శిశు సంరక్షణకు అధిక ప్రాధా న్యం ఇస్తున్నాయి.
ఆసుపత్రుల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు చేశాయి. గతంలో టీడీపీ పాలన లోనే భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో మాతా శిశు సంరక్షణ కేంద్రాలకు నిధులు కేటాయించింది. అప్పట్లోనే పనులు ప్రారంభిం చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కాం ట్రాక్టర్‌కు బిల్లులు కూడా మంజూరు చేయలేదు. దాంతో పనులు మందకొడిగా సాగాయి. తెలుగుదేశం కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాతా శిశు ఆరోగ్య కేంద్రాలపై దృష్టి పెట్టింది. తాడేపల్లి గూడెం, పాలకొల్లు ఏరియా ఆసుపత్రుల్లో నిర్మాణం చేపట్టిన మాతా శిశు కేంద్రాలను మార్చి 31లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. బకాయిలను చెల్లించింది.
పనులు వేగవంతం
బకాయిలు చెల్లించడంతో కాంట్రాక్టర్లు పను లు వేగవంతం చేశారు. గడవులోగా పనులు పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. గత ఐదేళ్లు పట్టింపు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ముఖం చాటేశారు. కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుండడంతో కొద్దిపాటి పనులతో సరిపెట్టారు. వాటికి కూడా సకాలంలో బిల్లులు చెల్లించలేదు. కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. బిల్లులు చెల్లిం పుకోసం ప్రాధాన్యం ఇచ్చారు. మాతా శిశు ఆరో గ్య కేంద్రాల బిల్లులను మంజూరు చేశారు.
తాడేపల్లిగూడెంలో రూ. 11.22 కోట్లు, పాలకొల్లులో రూ.12.50 కోట్లతో పనులు చేపడుతు న్నారు. ఇలా కోట్ల రూపాయలు కేంద్ర ప్రభు త్వం తల్లీ బిడ్డల ఆరోగ్య కోసం కేటాయిస్తోంది. ప్రస్తుతం కాస్త కష్టతరమైన కాన్పులు అయితే ఏలూ రుకు సిఫారసు చేస్తున్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు పూర్తయితే అటు వంటి ఇబ్బందులుండవు. గర్భిణులకు అన్ని రకాల పరీక్షలు, శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లనవసరం లేదు. ప్రసూతి నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు.
ప్రసూతి విభాగంలో ఆరోగ్యశ్రీ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి విభాగంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరమైతే ఆరోగ్యశ్రీలో నిర్వహించేందుకు అవకాశం ఉంది. దీనివల్ల సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదాయం వస్తుంది. వైద్యులకు సైతం ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. పేదలు, సామాన్యులంతా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రు ల్లోనే కాన్పులకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు అందిం చడానికి మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రత్యే కంగా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకోసం కోట్ల రూపాయల నిధులను విడు దల చేసింది. అవి అందుబాటోకి వస్తే ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రసూతి సేవలు అందనున్నాయి.