పోలవరం ప్రాజెక్టులో మట్టి, రాతి నాణ్యత పరిశీలన
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:52 PM
పోలవరం ప్రాజెక్టు మట్టి, రాతి నాణ్యత పరిశీలన బృందం (సీఎస్‌ఎంఆర్‌ఎస్) సెంట్రల్ సాయిల్ అండ్ రాక్ సర్వే, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్ (ఎన్‌ఐఆర్‌ఎం) బృందం బుధవారం పరిశీలించింది.

పోలవరం ప్రాజెక్టులో మట్టి, రాతి నాణ్యత పరిశీలన
నిపుణుల బృందం పర్యటన
పోలవరం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు మట్టి, రాతి నాణ్యత పరిశీలన బృందం (సీఎస్‌ఎంఆర్‌ఎస్) సెంట్రల్ సాయిల్ అండ్ రాక్ సర్వే, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్ (ఎన్‌ఐఆర్‌ఎం) బృందం బుధవారం పరిశీలించింది. ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాంలో వినియోగించనున్న మట్టి రాతి నాణ్యత పరిశీల న కార్యక్రమం, డయాఫ్రంవాల్ కాంక్రీట్ సామ ర్ధ్య పరీక్షలు ఈ బృందం రెండు రోజులుగా నిర్వహించింది. కొన్ని రోజుల క్రితం చేగొండపల్లి ప్రాంతంలో బ్లాచింగ్ ప్లాంట్ వద్ద రాతి నాణ్యత కోసం నమూనాల ను సేకరించారు. రాతి నమూనాల నాణ్యతా ప్రమాణాలు, డయాఫ్రం వాల్ కాంక్రీట్ నాణ్యతా ప్రమా ణాలు తదితర అంశాలను కేంద్రానికి పంపి స్పష్టమైన ఆదేశాలు తీసుకోవలసి ఉంటుంది. రెండు రెండు రోజులుగా ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాంలో వినియోగించ నున్న మట్టి నాణ్యత ఇతర అంశాలపై ఈ బృందం పోలవరం ప్రాజెక్టులో పలుచోట్ల మట్టి నమూనా సేకరణ చేపట్టారు. అల్లూరి సీతా రామరాజు మన్యం జిల్లా గొందూరు తదితర ప్రాంతాలను బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఎంఆర్‌ఎస్ కాంక్రీట్ నాణ్య త నిపుణులు లలిత్ కుమార్ సోలంకి, రాతి నాణ్యత నిపుణులు వినోద్ గుప్తా, డీఈ నిర్మల క్వాలిటీ కంట్రోల్ డీఈ శివప్రసాద్, డీఈఈ అనిల్ పాల్గొన్నారు.