Share News

గోవిందా.. గోవిందా..

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:40 AM

సంక్రాంతి పర్వదినాలు ముగియడంతో గురు వారం వేలాదిగా భక్తులు చినవెంకన్న క్షేత్రానికి చేరుకున్నారు.

గోవిందా.. గోవిందా..
ద్వారకాతిరుమల ఆలయ తూర్పు రాజగోపురం వద్ద భక్తుల సందడి

భక్తులతో కిటకిటలాడిన ఆలయం

హోరెత్తిన గోవింద నామ స్మరణ

ద్వారకాతిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పర్వదినాలు ముగియడంతో గురు వారం వేలాదిగా భక్తులు చినవెంకన్న క్షేత్రానికి చేరుకున్నారు. గోవింద నామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ద్వారకాతిరుమల ఆల యం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 15వేల మంది స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాల సమాచారం. స్వామివారి దివ్య మూర్తులను దర్శించి భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతర స్వామివారి ఉచిత ప్రసాదాలను, అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంటల వరకూ సమయం పట్టింది.

కనుల పండువగా అధ్యయనోత్సవాలు

శ్రీవారి క్షేత్రంలో ద్రవిడ ప్రబంధ అధ్యయ నోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ముక్కోటి పర్వదినం మొదలుగా పది రోజులు ఉత్సవాలను జరపడం సంప్రదాయం. గురువారం సాయంత్రం ఉభయదేవేరులతో స్వామి వారిని తొళక్క వాహనంపై ఉంచి నిత్య కల్యాణ మండప ఆవరణలోకి తెచ్చారు. మండపంలో వేదికపై బంగారు సింహాసనంపై ఉత్సవ మూ ర్తులను ఉంచి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచన చేశారు. అనంతరం నవ కలశస్నపన, అభిషేకాలను నిర్వహించారు. ఆ తరువాత తిరుమం జనాలు జరిపి స్వామి, అమ్మవార్లకు హారతులి చ్చారు. అనంతరం ఆలయ అర్చకులు, పండితులు సేవా కాలాన్ని జరిపి భక్తులకు తీర్థ, ప్రసాద వితరణ చేశారు. అనంతరం శ్రీవారి తిరువీధి సేవ క్షేత్రంలో వైభవంగా జరిగింది.

Updated Date - Jan 17 , 2025 | 12:40 AM