Share News

ఉత్తమ డ్రైవర్లకు సత్కారం

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:42 AM

బాధ్యతాయుతంగా, ఒత్తిళ్లకు గురికాకుండా వాహనాలు నడపాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ వి.భీమారావు అన్నారు.

ఉత్తమ డ్రైవర్లకు సత్కారం
మాట్లాడుతున్న ఏఎస్పీ భీమారావు

భీమవరం టౌన్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : బాధ్యతాయుతంగా, ఒత్తిళ్లకు గురికాకుండా వాహనాలు నడపాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ వి.భీమారావు అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆర్టీసీ గ్యారేజీలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. జీరో యాక్సిడెంట్‌ చేసిన డ్రైవర్లను అభినందించారు. జిల్లా రవా ణాశాఖ అధికారి ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఎన్‌వీఆర్‌ వరప్రసాదరా వు, డీఎం సత్యనారాయణమూర్తి మాట్లాడారు.

జిల్లా ఉత్తమ డ్రైవర్లు వీరే..

జోన్‌–3లో రాష్ట్రస్థాయిలో మూడో ఉత్తమ డ్రైవర్‌గా ఎన్నికైన నరసాపురానికి చెందిన బీవీ ఆర్‌ రావును సత్కరించారు. జిల్లాలో ఉత్తమ డ్రైవర్లుగా ముగ్గురిని ఎంపిక చేసి సత్కరించారు. బీఎస్‌ఆర్‌ రాజు (తాడేపల్లిగూడెం) సత్కారంతోపాటు మొదటి బహుమతిగా రూ. 1500 అందించారు. కేఆర్‌ బాబు (భీమవరం డిపో) సత్కారంతోపాటు రూ. 1200 నగదు బహుమతి. ఎస్‌.పెద్దిరాజు (తాడేపల్లిగూడెం డిపో) తృతీయ బహుమతిగా సత్కారంతోపాటు రూ.వెయ్యి నగదు బహుమతి అందించారు.

డిపోల వారీగా ఉత్తమ డ్రైవర్లు...

తాడేపల్లిగూడెం డిపోలో కె.ఎన్‌రావు మొదటి బహుమతి, వీవీఆర్‌ రెడ్డి ద్వితీయ బహుమతి, కె.కుసురాజు మూడో బహుమతి. తాడేపల్లిగూ డెం డిపోలో ఎంఎస్‌ రెడ్డి మొదటి బహుమతి, టీవీఎస్‌ఎన్‌ రాజు ద్వితీయ బహుమతి, బీకే మూర్తి తృతీయ బహుమతి. నరసాపురం డిపోలో పీఎం పతి మొదటి బహుమతి, పీవీవీఎస్‌ఎస్‌ కుమార్‌ ద్వితీయ బహుమతి, కేసీహెచ్‌.రావు తృతీయ బహుమతి, తణుకు డిపోలో ఎంపీరావు మొదటి బహుమతి, సీహెచ్‌. శ్యాంసన్‌ రెండో బహుమతి, పీజీ రాజు తృతీయ బహుమతి పొందారు.

ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్లకు సత్కారం

ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిలో ఇద్దరు చొప్పున ఎంపిక చేసి సత్కరించారు.

47 అవార్డులు అందుకున్నా..

ఆర్టీసీ డ్రైవర్‌గా చేరి 40 ఏళ్లు అయ్యింది. ఇప్పటి వరకు 47 అవార్డులు అందుకున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్నా. జిల్లా స్థాయిలో ప్రతి ఏడాది జీరో యాక్సిడెంట్‌ డ్రైవర్‌గా అవార్డు అందుకుంటూనేఉన్నా. .

– బీవీఆర్‌ రావు, నరసాపురం

అవార్డు సంతృప్తినిచ్చింది

ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఎటువంటి ఒత్తిళ్ళకు గురికాకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు ధరిచేరవు. కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి. అందరూ మనవారేనని బాధ్యతాయుతంతో ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకుసాగవచ్చు. అవార్డు రావడం సంతృప్తి నిచ్చింది.

– బీఎస్‌ఆర్‌ రాజు, తాడేపల్లిగూడెం

అవార్డును ఊహించలేదు

31 ఏళ్లుగా డ్రైవర్‌గా కొనసాగుతున్నా. జీరో యాక్సిడెంట్‌ డ్రైవర్‌గా జిల్లాలో ద్వితీయ బహుమతి అందుకోవడం ఆనందంగా ఉంది. అవార్డు అందుకోవడంలో అధికారులతోపాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంది. అవార్డు వస్తుందని ఊహించలేదు సంతృప్తినిచ్చింది.

– కేఆర్‌ బాబు, భీమవరం

పనిలో నమ్మకం, జాగ్రత్త ఉండాలి

పనిలో నమ్మకం. జాగ్రత్తలు తీసుకుంటే ఎటు వంటి ప్రమాదాలు లేకుం డా ఉద్యోగ నిర్వహణ చేసుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు బస్సులో ఉన్నవారందరూ మనవారేనని దృష్టితో డ్రైవింగ్‌ చేయాలి

– ఎస్‌.పెద్దిరాజు

తృతీయ బహుమతి, తాడేపల్లిగూడెం

Updated Date - Feb 15 , 2025 | 12:42 AM