రూటు మారింది
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:11 AM
కేంద్ర ప్రభుత్వం పశ్చిమకు మరో వరం ప్రకటించింది. ఆకివీడు నుంచి దిగమర్రు వరకు 165 జాతీయ రహ దారిని నాలుగు లైన్‌లుగా విస్తరించనుంది.

రూరల్ మండలం మీదుగా వెళ్లేలా భీమవరం నుంచి బైపాస్ అలైన్‌మెంట్
(భీమవరం–ఆంఽధ్ర జ్యోతి)
కేంద్ర ప్రభుత్వం పశ్చిమకు మరో వరం ప్రకటించింది. ఆకివీడు నుంచి దిగమర్రు వరకు 165 జాతీయ రహ దారిని నాలుగు లైన్‌లుగా విస్తరించనుంది. పామర్రు నుంచి ఆకివీడు మీదుగా దిగమర్రు వరకు గత తెలుగు దేశం హయాంలోనే జాతీయ రహదారి మంజూరైంది. పామర్రు నుంచి ఆకివీడు వరకు తొలి దశలో 60 కిలో మీటర్ల మేర రెండు లైన్‌లనే నిర్మించారు. ప్రాజెక్ట్ పూర్తి కావచ్చింది. రెండో దశలో ఆకివీడు–దిగమర్రు వరకు 42 కిలోమీటర్లు నాలుగు లైన్‌లుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం అంగీకరించింది. అలైన్‌మెంట్‌కు ఆమోదముద్ర వేసింది. భీమవరం వద్ద రూరల్ గ్రామాల మీదుగా వెళ్లనుంది. ఇప్పటి వరకు అలైన్‌మెంట్‌పైనే సందిగ్ధత ఉంది. భీమవరం బైపాస్ రహదారినే గతంలో అలైన్ మెంట్‌గా నిర్ధారించారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేశారు. మూడు అలైన్‌మెంట్ లను కేంద్రానికి ప్రతిపాదించారు. భీమవరం రూరల్ మండల గ్రామాలు మీదుగా అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆకివీడు నుంచి వీరవాసరం వరకు ఆక్వా గ్రామాల మీదుగానే అలైన్‌మెంట్ వెళు తోంది. తాజా ప్రయత్నం వల్ల ఆక్వాతోపాటు భీమవరం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
12 ప్రాంతాల్లో వంతెనలు
గ్రామాల వద్ద రాకపోకలకు ఇబ్బందు లు లేకుండా 12 ప్రాంతాల్లో వంతెన లు నిర్మించాలని గుర్తించారు. బైసాస్ 29 కిలోమీటర్లు ఉంటుంది. మరో 13 కిలోమీటర్లు ప్రస్తుత రహదారినే నాలుగు లైన్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఆకివీడు–వీరవాసరం మధ్యలో బైపాస్ విస్తరించేలా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం అలైన్ మెంట్‌ను గుర్తించింది. అధికారులు సర్వేలో నిమగ్నమ య్యారు. డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. మార్చిలోగా ఆమోదముద్ర వేస్తారు. టెండర్లు పిలుస్తారు. డీపీఆర్‌ను ఆమోదింప జేస్తే నిధులకు కొరత ఉండదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించింది. మార్చిలోగా డీపీఆర్‌కు ఆమోదముద్ర పడితే నిధులు మనుగడలో ఉంటాయి. లేదంటే మురిగిపోతాయి. ఫలితంగా అధికారులు సర్వేలో నిమగ్నమయ్యారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీ ఆర్)ను సిద్ధం చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే డీపీఆర్ పూర్తి చేయాలన్న సంకల్పం తో జాతీయ రహదారి అధికారులు ప్రయత్నాలు చేస్తు న్నారు. అవసరమైన భూమిని గుర్తిస్తున్నారు. అలైన్‌మెం ట్‌పైనా సందిగ్ధత వీడింది. ఉండి, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాలను కలుపుతూ రెండో దశ 165 జాతీయ రహదారి అభివృద్ధి చెందుతుంది. రహదారి అలైన్‌మెంట్ ఆమోదం విషయంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్‌వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుల పాత్ర ఉంది. మూడు నెలల క్రితమే కేంద్రానికి మూడు అలైన్‌మెంట్‌లు పంపారు. అన్నీ భేరీజు వేసుకున్న కేంద్రం అందులో ఒక అలైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చింది. అదే భీమవరం పట్టణానికి దిగువ ప్రాంతం నుంచి అంటే రూరల్ మండల గ్రామాల మీదుగా రహదారి వెళుతుంది.
ఆక్వాకు జోష్
ఈ రహదారి నిర్మాణం వల్ల ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఆక్వా ప్రాజెక్ట్‌లకు అనువుగా ఉంటుంది. భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల ప్రజల రాకపోకలకు మరింత మేలు జరుగుతుంది. భీమవరం పట్టణానికి పూర్వ వైభవం రానుంది. జిల్లాకు ఆర్థిక రాజధాని భీమవరం అంటూ అంతా చెప్పుకొనేవారు. గత ఐదేళ్లలో పెద్దగా అభివృద్ధి చెందలేదు. జాతీయ రహదారి నిర్మాణం వల్ల జిల్లా కేంద్రంగా రూపు రేఖలు మారిపోనున్నాయి.