రూ.8 కోట్లతో ఏటిగట్టు పటిష్ఠం
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:22 AM
మండల పరిధిలో రూ.8కోట్ల గోదావరి ఏటిగట్టు పటిష్ఠం చేసే పనులు జరుగుతున్నాయి. పనుల ను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం పరిశీలించారు.

పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
యలమంచిలి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో రూ.8కోట్ల గోదావరి ఏటిగట్టు పటిష్ఠం చేసే పనులు జరుగుతున్నాయి. పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం పరిశీలించారు. నాడు జగన్ పాలనలో గోదావరి ఏటిగట్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, నేడు చంద్రబాబు పాలనలో ఏటిగట్టును పటిష్ఠం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పనులపై కన్జర్వెన్సీ అధికారులతో సమీక్ష అనంతరం దొడ్డిపట్లలో మంత్రి రామా నాయుడు విలేకరులతో మాట్లాడారు. బూరుగు పల్లి వద్ద గోదావరి ఏటిగట్టుకు గండి పడితే 10 నుంచి 12 మండలాలు నీట మునిగే పరిస్థితు లు ఎదురవుతాయని, నివారణకు టీడీపీ ప్రభు త్వ హయాంలో రూ.6కోట్లు నిధులతో గ్రోయిన్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. 2019– 24 జగన్ ప్రభుత్వంలో కనీసం రూపాయి పని, తట్ట మట్టి వేసిన దాఖలాలు లేకపోవడంతో వరద సమయంలో ప్రజలు ముంపుభయానికి గురయ్యారన్నారు. వరద సమయంలో ఏటిగట్టు బలహీనంగా ఉన్నచోట్ల ఆయా గ్రామాల ప్రజ లు, యువకులు రాత్రింబవళ్లు గస్తీకాసి.. సర్వేబా దులు, ఇసుక బస్తాలు వేసుకుని గ్రామాలను ముంపునుంచి కాపాడుకున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజలే తమను తాము కాపాడుకున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏటిగట్టును పటిష్టం చేసేందుకు రూ.8కోట్లు నిధులు మంజూరుచేశారని మంత్రి రామానాయుడు వివరించారు. ఆనాడు జగన్‌కు 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే అన్ని రంగాలను, వ్యవస్థలను సర్వనాశనం చేశాడన్నారు. నేడు కష్టాల మధ్య కూడా అభి వృద్ధి, సంక్షేమం దిశగా చంద్రబాబు విజన్, పవన్‌కల్యాణ్ తోడు, మోదీ అండతో సుపరిపా లన అందిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాల న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడెక్కి పోరాటంచేస్తే గానీ వరదసాయం అందేదికాదని, నేడు కూటమి ప్రభుత్వంలో వరదనీరు గడప వద్దకు వస్తుందని తెలిసిన వెంటనే సాయం అందించామని మంత్రి రామానాయుడు తెలి పారు. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనుల నిమిత్తం చంద్రబాబు మంజూరుచేసిన రూ. 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరు లోగా పూర్తయ్యేలా దృష్టిపెట్టామన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన ఏటిగట్లను బలో పేతం చేయడం, మురుగుకాలువల్లో పూడికతీత పనులు, గేట్లు, లాకులు, షట్టర్లు, లాకులు, రోప్ లు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నా మన్నారు. నాడు ఇరిగేషన్‌శాఖలో 12ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆ మోదముద్ర వేసి ఉద్యోగుల గౌరవాన్ని కాపాడు తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజకీ య ప్రేరేపితంగా 386 మంది ఇరిగేషన్ ఉద్యోగు లపై విజిలెన్స్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే వాటి నుంచి ఉద్యోగులను విముక్తు లను చేశామని మంత్రి రామానాయుడు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు బోనం నాని, మామిడిశెట్టి పెద్దిరాజు, ఆరుమిల్లి రామశ్రీనివాస్, రుద్రరాజు సత్యనారాయణరాజు, చిలుకూరి బాలాజీ, బొప్పన హరికిషోర్, చిట్టూరి ఆంజనేయులు, చేగొండి రవిశంకర్, డేగల సత్తికొండ తదితరులు పాల్గొన్నారు.