Share News

దిగొచ్చిన బియ్యం

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:54 PM

కర్నూలు సోనా 26 కేజీల బస్తా గత ఏడాది డిసెంబరులో రూ.1450 అమ్మగా ఇప్పుడు రూ.1,250కి తగ్గింది. హెచ్‌ఎంటి రకం బియ్యం 26 కిలోలు రూ.1,600 నుంచి రూ.1400కు తగ్గింది.

దిగొచ్చిన బియ్యం

క్వింటాలుకు రూ.1,000 తగ్గుదల

పెరిగిన దిగుబడి.. తగ్గిన వినియోగం

రిటైల్‌ మార్కెట్‌లో పతనమైన ధర

పెరిగిన రేషన్‌ బియ్యం వాడకం

కర్నూలు సోనా 26 కేజీల బస్తా గత ఏడాది డిసెంబరులో రూ.1450 అమ్మగా ఇప్పుడు రూ.1,250కి తగ్గింది. హెచ్‌ఎంటి రకం బియ్యం 26 కిలోలు రూ.1,600 నుంచి రూ.1400కు తగ్గింది. పిఎల్‌ రకం బియ్యం గతంలో రూ.1150 ఉండేవి. ఇప్పుడు రూ.1000లకే లభ్యమవుతున్నాయి. స్వర్ణ రకం బియ్యం 26 కేజీల ప్యాకెట్‌ గతంలో రూ.1050 ఉండగా ఇప్పుడు రూ.900కు అమ్ముతున్నారు.

పాలకొల్లు, జనవరి 17(ఆంధ్రజ్యోతి):బియ్యం ధరలు దిగి వచ్చాయి. మార్కెట్‌లో క్వింటాలుకు వెయ్యి రూపాయల వరకు తగ్గింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు అధిక శాతం మంది సన్న బియ్యం వినియోగిస్తారు. స్థానికం గా సన్న బియ్యం ధాన్యం ఇక్కడ పంట లేని కారణంగా కర్నాటక, తెలంగాణలోని కొన్ని ప్రాం తాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గడచిన సార్వాలో దిగుబడులు అధికంగా ఉండటం, సన్న బియ్యం అమ్మకాలు నాలుగింట ఒకవంతు తగ్గడంతో తగ్గుముఖం పట్టాయి. ఇటీవల రేషన్‌ బియ్యం అక్రమ ఎగుమతులపై ఉక్కుపాదం మోపడంతో మార్కెట్‌లో వీటి కొనుగోళ్లు తగ్గా యి. రేషన్‌ బియ్యాన్ని రిటైల్‌ వర్తకులు కొని రీసైక్లింగ్‌కు పంపిస్తారు. ఇటీవల దాడులు పెర గడంతో వీటి అమ్మకం ధర కిలో రూ.20 నుంచి రూ.15కి తగ్గింది. కోటా బియ్యం తెచ్చుకునే లబ్ధిదారులు వాటిని అమ్ముకునే అవకాశాలు తగ్గడంతో, సన్న బియ్యా న్ని కోటా బియ్యంలో కలుపుకుని వాడు తున్నారు. ఈ కారణంగా సన్న బియ్యం అమ్మకాలు తగ్గాయి. కొన్నిరకాల బియ్యంపై కేజీకి రూ.8 తగ్గగా మరికొన్ని రకాలపై రూ.10 తగ్గింది. గత జగన్‌ ప్రభుత్వంలో కోటా బియ్యం విచ్చలవిడిగా అమ్మేవారు. వీటికి ఫాలిష్‌ పెట్టి ఇతర దేశాలకు

ఎగుమతి చేసేవారు. ఇప్పుడు అక్రమ ఎగుమతులు నిలిచిపోవడంతో వీటి ధరలు పడిపోయాయి. కోటా బియ్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది రైతులు పశువుల దాణాకు వినియోగిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో బియ్యాన్ని నూకగా మార్చి చేపల మేతగా వినియోగిస్తున్నారు. వీటి అవసరాలకు జిల్లాలో పంపిణీ చేస్తున్న కోటా బియ్యంలో సుమారు 30 శాతం అక్రమ వినియోగం జరుగుతుండగా 70 శాతం లబ్ధిదారులు వినియోగిస్తున్నారు. కోటా బియ్యం తీసుకుంటున్న కొన్ని కుటుంబాలలో బియ్యాన్ని అన్నానికి వినియోగిస్తుండగా, మరపట్టించి వరి నూక ఉప్మాకు, దోశల పిండిగా ఉపయోగిస్తున్నారు. మొత్తంగా రేషన్‌ బియ్యం అక్రమరవాణాకు అడ్డుకట్టపడటంతో సన్న బియ్యం ధరలు దిగి వచ్చాయి. మరోవైపు అధిక మంది సాయంత్రం పూట అన్నానికి బదులు అల్పాహారాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గాయి. దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:54 PM