Share News

అసలేం జరిగింది ?

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:04 AM

వీఆర్‌లో వున్న తణుకు రూరల్‌ ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తి(38) మృతిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అసలేం జరిగింది ?
ఎస్‌ఐ మూర్తి(ఫైల్‌)

తణుకు/కె.గంగవరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): వీఆర్‌లో వున్న తణుకు రూరల్‌ ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తి(38) మృతిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు, బ్యాచ్‌మేట్స్‌, కుటుంబ సభ్యులు ఆరోపి స్తుంటే.. కాదు గన్‌మిస్‌ ఫైర్‌ అయ్యిందని జిల్లా ఎస్పీ నయీం అస్మి చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగుల కథనం ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరానికి చెందిన ఆదుర్తి గోపా లరావు, తల్లి సూర్యావతిలకు ఇద్దరు కుమారులు వెంకటేశ్‌, మూర్తి, కుమార్తె శ్రీలక్ష్మి. మూర్తి టెన్త్‌ వరకు స్వగ్రామంలోనే చదివాడు. ఎంతో కష్టపడి 2012లో ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు. విజయలక్ష్మితో వివాహం కావడంతో వీరికి కుమారుడు చందన్‌(5) కుమార్తె హేమాన్షి (16 నెలలు) ఉన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మచిలీపట్నం, కైకలూరు, భీమవరం టూ టౌన్‌, పాలకోడేరు, పెరవలి, నరసాపురం రూరల్‌, ఆచంట, తణుకు రూరల్‌ స్టేషన్‌లలో పనిచేశాడు. వేల్పూరులో రెండు గేదెల అపహరణ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో నాలుగు నెలలు క్రితం పోలీసు ఉన్నతా ఽధికారులు వీఆర్‌లో పెట్టారు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనకు సంబంధం లేని కేసులో వీఆర్‌కు పంపారని అవమానంగా భావించాడు. పెను గొండలో సీఎం పర్యటనకు బందో బస్తుగా వెళ్లాలని ఆదేశాలు రావ డంతో.. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తణుకు రూరల్‌ పోలీసుస్టేషన్‌కు బైక్‌పై వచ్చాడు. కొంతసేపటికి సర్వీసు రివాల్వర్‌ తీసుకుని పక్కనే ఉన్న వాష్‌ రూమ్‌కు వెళ్లి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలియ గానే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 2012 బ్యాచ్‌ ఎస్‌ఐలు పెద్ద ఎత్తున తణుకు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అందరికి ధైౖర్యం చెప్పే మూర్తి ఇలా ఎందుకు చేశాడోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేగింది. ఉన్నతాధికారుల నుంచి రకరకాల ఒత్తిళ్లు సిబ్బందిని కుంగిపో యేలా చేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి.

రివాల్వర్‌ మిస్‌ ఫైర్‌ : ఎస్పీ నయీం

‘ఎస్‌ఐ మూర్తి ఉదయం స్టేషన్‌కు వచ్చా రు. అందరితోనూ మాట్లాడి వాష్‌ రూమ్‌కు వెళ్లారు. అక్కడ రివాల్వర్‌ మిస్‌ ఫైర్‌ అ య్యింది. దీనిని గమనించి సిబ్బంది 108లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మూర్తి చనిపోయారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తెస్తాం’ అని జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపా రు. ఆయన వెంట ఏఎస్పీ భీమారావు తదితరులున్నారు. ఎస్‌ఐ కుటుంబానికి న్యాయం చేస్తామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఆసుపత్రిలో మూర్తి మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కోటిపల్లిలో శనివారం పోలీసు అధికారిక లాంఛ నాలతో అంత్యక్రియలకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు పామర్రు ఎస్‌ఐ ఎస్‌కే జానీ బాషా చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్నాడు

– సోదరుడు, సోదరి ఆరోపణ

‘చిన్నప్పటి నుంచి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉన్న వ్యక్తిత్వం తనది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో వున్న మూర్తిని, ఏలూరు రేంజిలో రిపోర్టు చేయాలని ఉన్నతాధికా రులు చెప్పారు. దీంతో ఎక్కడ తనకు దూరంగా పోస్టు వస్తుందోనని భావించాడు. జరిగిన దానిని వదిలేయ్‌ మళ్లీ ఉద్యోగం వస్తుంది. ఽధైర్యంగా ఉండు. లేదంటే ఉద్యోగం వదిలేసి వచ్చేయమని చెప్పాం. ఉదయం స్టేషన్‌కు వెళ్లిన కొద్దిసేపటికే రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. పోలీసు లు, మీడియా తీరు వల్లే ఇలా జరిగింది. సంబంధం లేని విషయాన్ని పెద్దభూతంలా చేశారు. ఇప్పుడు మనిషే పోయాడ’ని సోదరుడు వెంకటేశ్‌, సోదరి శ్రీలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘మూర్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అతని ఫోన్‌ కాల్‌ లిస్టు బయటపెట్టాలి. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయి. అధికారుల వేధింపులు ఉన్నాయా ? అనే విషయం తేలాలి. సెల్‌ఫోన్‌, వీడియోలు బయటపెట్టాలి’ అని ఆయన స్నేహితుడు కె.గంగవరానికి చెందిన వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 01 , 2025 | 01:04 AM