ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:49 AM
ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. అధికారులు పరీక్ష కేంద్రాలను సర్వం సిద్ధం చేస్తున్నారు.

ఈ నెల 20 న హాల్ టికెట్స్ జారీ
33,842 విద్యార్థులు
52 పరీక్షా కేంద్రాలు
900 మంది ఇన్విజిలేటర్లు..
భీమవరం రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. అధికారులు పరీక్ష కేంద్రాలను సర్వం సిద్ధం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్స్, సిబ్బంది నియామకంపై అధికారులు సన్నాహాలు చేసేశారు. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసి వాటన్నింటిలోను పరీక్షల నిఘా కొరకు సీసీ కెమెరాలను పెడుతున్నారు. ఈ కెమెరాల ద్వారా జిల్లా పరీక్షల నిర్వహణ కేంద్రం వద్ద పరీక్ష కేంద్రాల వీడియో రికార్డ్ అవుతుంది.
విద్యార్థుల సెల్‌ఫోన్‌కు హాల్‌టికెట్
ఇంటర్మీడియెట్ పరీక్షల హాల్ టికెట్స్ నేరుగా విద్యార్థుల సెల్‌ఫోన్‌లకు వెళ్లేలా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి విద్యార్థుల సెల్‌ఫోన్‌లో వాట్సాప్ నుంచిహాల్ టిక్కెట్ పొందవచ్చు. విద్యార్థికి సెల్‌ఫోన్ లేకపోతే వారి తల్లిదండ్రుల ఫోన్‌లో వాట్సాప్ నుంచి హాల్ టికెట్ పొందవచ్చు. ఇప్పటికే హాల్‌టికెట్ జారీపై చర్యలు తీసుకు న్నారు. గతంలో ఇంటర్ విద్యాసంస్థలు విద్యార్థులు ఫీజులు పెండింగ్‌లో ఉందనే నెపంతో హాల్‌టికెట్ ఇవ్వడంలో ఇబ్బందులు పెట్టేవారు. అలాంటివి జరగకుండా కొత్త విధానాన్ని బోర్డు తీసుకువచ్చింది.
జిల్లాలో 33,845 మంది విద్యార్థులు
జిల్లాలో 85 ప్రైవేట్ ఇంటర్మీడియెట్ కళాశాలలు, 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రెండు ఎయిడెడ్, 2 సోలషల్ వెల్ఫేర్, 26 ఫైస వన్ కళాశాలలు ఉన్నాయి. వీటి నుంచి ఈ ఏడాది ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,574 ద్వితీయ సంవత్సరం 16,271 మొత్తం 33,845 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు
1 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. 52 పరీక్ష కేంద్రాల్లో ఉండి మండలం యండగండి పరీక్ష కేంద్రం సమస్యాత్మక కేంద్రంగా గుర్తించారు. 450 మంది ఇంటర్ అధ్యాపకులతోపాటు మరో 450 మందిని ప్రభుత్వ పాఠశాలలోని సెకండ్ రైట్ టీచర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 900 మందిని పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు.
ఆర్టీసీ బస్సులకు ముందస్తుగా సమాచారం
ఇంటర్మీడియట్ పరీక్షలలో విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీకి ముందస్తు సమాచారం ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రానికి బస్ సౌకర్యం ఉండాలని సమయానికి విద్యార్థులను చేర్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పరిశుభ్రత ఏర్పాట్లు మునిసిపాలిటీలకు అప్పగించారు. తాగునీరు, పరీక్ష గదులలో విద్యార్థి సౌకర్యా ర్థం హెల్త్ సౌకర్యం కల్పిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద టాయిలెట్స్ ఉండేలా చూడాలని ఆదేశాలు వెళ్లాయి.
19న ముగియనున్న ప్రాక్టికల్స్
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ ఈ నెల 19న ముగుస్తున్నాయి. 10న మొదలైన ప్రాక్టికల్స్ పది రోజులపాటు జరుగుతున్నాయి. 73 సెంటర్లలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి.