Share News

వైభవంగా ప్రభల తీర్థం

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:48 AM

మండలంలోని పెనుమంచిలి, కందరవల్లి సరిహద్దు ప్రాంతంలో పచ్చని పొలాల మధ్య బుధవారం ప్రభల తీర్థం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ప్రభల తీర్థం
ఆచంట మండలం పెనుమంచిలి, కందరవల్లి మధ్య ప్రభల తీర్థం

పొలాల మధ్య కొలువైన స్వామి వార్లు

ఆచంట, జనవరి 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెనుమంచిలి, కందరవల్లి సరిహద్దు ప్రాంతంలో పచ్చని పొలాల మధ్య బుధవారం ప్రభల తీర్థం వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగలో కనుమ రోజు వల్లూరు, కరుగోరుమిల్లి, కోడేరు, పెనుమంచిలి, కందరవల్లి ఆలయాల నుంచి ఊరేగింపు వచ్చిన ప్రభలు అక్కడ కొలువుదీరుతాయి. ఆచంట పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రభల తీర్థానికి తరలివస్తారు. స్వామి వార్లకు పూజలు చేస్తారు. ఆయా గ్రామాల నుంచి ప్రభలు వరి చేలు, కాలువల్లో నుంచి ఊరేగింపు తరలి రావడాన్ని ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తారు. కొద్ది గంటల సేపు జరిగి వేడుక ఆధ్యా త్మిక శోభకు అద్దం పడుతుంది. ఎస్‌ఐ కె.వెంకటరమణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jan 16 , 2025 | 12:48 AM