Share News

వైరస్‌ కూత.. !

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:56 AM

ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో పౌలీ్ట్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. కోడి గుడ్డు రూ.5.50 నుంచి రూ.3.50కు పడిపోయింది. ఫారం కోడి పది రూపాయలకే లభిస్తోంది. అసలే అంతంతమాత్రంగా వున్న ఫౌల్ర్టీ వీటి ప్రభావాలతో మరింత కుదేలైంది.

వైరస్‌ కూత.. !
వేల్పూరులో కోళ్ల ఫారం చుట్టూ బ్లీచింగ్‌ చల్లిన దృశ్యం

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో సంక్షోభంలో పౌల్ర్టీ పరిశ్రమ

గుడ్డు ధర ఢమాల్‌.. పది రూపాయలకే ఫారం కోడి

మిగిలిన కోళ్లను కాపాడుకునేందుకు లక్షల్లో ఖర్చు

తాడేపల్లిగూడెం రూరల్‌/తణుకు రూరల్‌/ఆకివీడు/ పాలకోడేరు/ఉంగుటూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో పౌలీ్ట్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. కోడి గుడ్డు రూ.5.50 నుంచి రూ.3.50కు పడిపోయింది. ఫారం కోడి పది రూపాయలకే లభిస్తోంది. అసలే అంతంతమాత్రంగా వున్న ఫౌల్ర్టీ వీటి ప్రభావాలతో మరింత కుదేలైంది. పోనీలే కొన్ని రోజులు చూద్దామనుకునే పరిస్థితి రైతులకు కనిపించడం లేదు. ఓ వైపు బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌ తమ పౌలీ్ట్రలోనూ వస్తుందేమో అని భయంతో వైద్యులు చెప్పిన వ్యాక్సిన్‌లు వాడుతున్నారు. మనుషులను పెట్టి ఫారం చుట్టూ పది కిలోమీటర్ల వరకూ మందులు పిచికారి చేయిస్తున్నారు. ఈ ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ తరుణంలో కోడి గుడ్ల, కోళ్లు కాపాడుకోలేక కొన్నిచోట్ల ఒక్కోటి రూ.10కి తెగనమ్ముకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి 15 లక్షల ఫారం కోళ్లు ఉండగా వైరస్‌ వల్ల 40 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. 75 లక్షల కోళ్లు మాత్రమే మిగిలాయి.

కోళ్లకు బర్డ్‌ ప్ల్యూ సోకిన తణుకు రూరల్‌ మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ర్టీ పారం నుంచి కిలో మీటరు పరిధిలోని పరిసరాలను అధికారుల పర్యవేక్షణలో శానిటేషన్‌ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. వేల్పూరు పరిధిలోని రెడ్‌ జోన్‌లోని ఐదు పారాల్లో కోళ్లను రాత్రికి రాత్రి వేరే చోటకు తరలించి పారాలను ఖాళీ చే శారు. బర్డ్‌ఫూ నిర్దారణ జరిగిన ఫారం కోళ్లను గురువారం ఖననం చేయనున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్‌ కెశంకర్‌ బావనారాయణ తెలిపారు.

ఆకివీడులో ధరలు పెరిగాయి

బర్డ్‌ ఫ్లూ కారణంగా కోళ్లు లేకపోవడంతో ఇతర జిల్లాల్లో ధరలు పెంచారు. గుంటూరు, నెల్లూరు, విజయవాడ నుంచి కోళ్లను తీసుకువస్తున్నాం. అక్కడ కూడా అధిక ధరలతో అమ్మకాలు జరుపుతున్నారు. ఈ రెండు రోజుల్లో కేజీ చికెన్‌కు రూ.20 పెరిగింది. కోళ్ళు లేకపోవడం వలనే ఈ విధంగా జరుగుతుంది. సగానికి సగం అమ్మకాలు పడిపోయాయని ఆకివీడు వీవీ బాయిలర్స్‌ అధినేత రవికుమార్‌ తెలిపారు.

ఫ వైరస్‌ల ఉధృతి నుంచి తమ కోళ్లను కాపాడు కునేందుకు తాడేపల్లిగూడెం మండలంలోని ఓ పౌలీ్ట్ర రైతు చేయని ప్రయత్నం లేదు. పది రోజులుగా కోళ్లకు నాలుగు రకాల వ్యాక్సిన్‌, పరిసరాల చుట్టూ రోజూ మందులు పిచికారి, లోపలికి వెళ్లే కూలీలకు ప్రత్యేక శానిటైజేషన్‌తో రూ.పది లక్షలకు పైగానే ఖర్చయింది.

బర్డ్‌ ఫ్లూపై వదంతులు నమ్మొద్దు : కలెక్టర్‌ నాగరాణి

పౌల్ర్టీ పరిశ్రమలో నెలకొ న్న బర్డ్‌ఫ్లూ కారణంగా వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దని కలెక్టర్‌ నాగరాణి ప్రజలను కోరారు. పౌల్ర్టీ పారాల్లో చనిపోయిన కోళ్లను శాస్ర్తీయ పద్ధతిలోనే ఖననం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణకు 20 రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ విషయమై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. జిల్లాలోని చెరువులు, కొల్లేరు పరివాహక ప్రాంతాలో వలస పక్షులు వచ్చే ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా అప్ర మత్తం చేశామన్నారు. ఎలర్ట్‌ జోన్‌లోని ప్రాంతాలలో మినహా మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు ఉడకబెట్టిన గుడ్లు, మాంసాన్ని నిరభ్యంతరంగా వినియోగించవచ్చని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. అన్ని జాగత్రలతో పిబ్రవరి 13 నాటికి వ్యాది సోకిన కోళ్లను తొలగించి ఖననం చేయడం జరుగుతుందని చెప్పారు. బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు, కోడి మాంసం, కోడిగుడ్లు అమ్మకాలు, వినియోగంపై మూడు నెలలపాటు నిషేధం విధించినట్లు తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతిబ్‌ కౌసర్‌ భానో ఆరుగొలనులో జరిగిన సమావేశంలో వెల్లడించారు.

Updated Date - Feb 13 , 2025 | 12:57 AM