Share News

పంచాయతీలకు నిధుల పండగ !

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:53 AM

వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన పంచాయతీలు కూటమి సర్కార్‌ చొరవతో మళ్లీ జీవం పోసుకుం టున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీలకు 2024–2025 ఆర్థిక సంఘం నిధులను ఇటీవల విడుదల చేయడంతో పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్ఠిని సంత రించుకోనున్నాయి.

పంచాయతీలకు నిధుల పండగ !

ఆర్థిక సంఘం నిధులు రూ.33.25 కోట్లు విడుదల

గత ప్రభుత్వంలో దారి మళ్లింపు

సక్రమంగా వినియోగిస్తే గ్రామాలకు మహర్దశ

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన పంచాయతీలు కూటమి సర్కార్‌ చొరవతో మళ్లీ జీవం పోసుకుం టున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీలకు 2024–2025 ఆర్థిక సంఘం నిధులను ఇటీవల విడుదల చేయడంతో పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్ఠిని సంత రించుకోనున్నాయి. జిల్లాలో 544 పంచాయ తీలకు గాను రూ.33.25 కోట్లు విడుదల య్యాయి. సర్పంచ్‌లు కొలువుతీరిన తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభు త్వం పంచాయతీలను పట్టించుకోలేదు. నిధుల లేమితో పంచాయతీలో వీధిలైట్లు సైతం మార్చలేని స్థితికి వెళ్లాయి. సచివా లయ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచ్‌లను పూర్తిగా కీలుబొమ్మలుగా మార్చారు. కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను వైసీపీ సర్కారు దారి మళ్లించడంతో పంచా యతీల నిధులు లేమితో కొట్టుమిట్టాడాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పంచాయతీల దుస్థితిని చూసి అధికారం లోకి రాగానే పంచాయతీ లకు మంచి రోజులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకుంటామని ఇ చ్చిన హామీ మేరకు కేంద్రం చొరవతో కూట మి సర్కార్‌ తొలివిడతగా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది.

అభివృద్ధివైపు అడుగులు..

ఎన్నికల ముందు చంద్రబాబు పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తామ న్నారు. ప్రభుత్వం వచ్చి ఏడునెలలు గడవక ముందే పంచాయతీలకు నిధులు విడుదల చేయడం సంతోషదాయకం. పంచాయతీల అభివృద్ధికి నిధులు వినియోగిస్తాం. గ్రామాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారా నికి ఈ నిధులు దోహదపడతా యి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.

– పాలడుగుల లక్ష్మణరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీల సంఘం అధ్యక్షుడు

Updated Date - Feb 08 , 2025 | 12:53 AM