చిత్రకళతో మానసిక వికాసం
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:05 AM
చిత్రకళలతో మానసిక వికాసం కలుగుతుందని, సమాజంలో చైతన్యం కలిగించవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ఎన్టీఆర్ చిత్రాల స్పాట్ పెయింటింగ్
పాలకొల్లు అర్బన్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): చిత్రకళలతో మానసిక వికాసం కలుగుతుందని, సమాజంలో చైతన్యం కలిగించవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. లయన్స్ క్లబ్ భవనంలో ఆదివారం రాత్రి వ.పా, బాపు ఆర్డ్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నంద మూరి తారక రామారావు శత జయంతిని పుర స్కరించుకుని దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 60 మంది చిత్రకారులు ఎన్‌టిఆర్ చిత్రాలను స్పాట్ పెయింటింగ్ ద్వారా చిత్రీకరిం చారు. 60 మందిలో ఐదుగురు మహిళా చిత్రకా రులు ఉన్నారు. కర్నాటక, తెలంగాణ, తమిళ నాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎన్‌టిఆర్ చిత్రాలను చిత్రీకరించారు. కార్యక్రమంలో డి.రామకృష్ణారావు, తమిళనాడు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటి డైరెక్టర్ ధర్మలింగరం, షణ్ముఖం, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జయభారత రెడ్డి, పాపారా వు నాయుడు, జీఎస్‌ఎన్, కొసనా భాస్కరరావు, చెల్లుబోయిన రాము, నక్కా వెంకటేశ్వరరావు కడలి శ్రీనివాస్, జీఎస్‌ఎన్.రవికుమార్, పలువు రు ఆర్టిస్ట్‌లు, స్థానికులు పాల్గొన్నారు.