Share News

ఇక కొత్తగా..

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:49 AM

ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదురకాల పాఠశాలల వ్యవస్థ.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలో పేతం చేసేందుకు ఓ టానిక్‌లా పనిచేస్తుందని భావి స్తున్నారు.

  ఇక కొత్తగా..

జగన్‌ ప్రభుత్వ విధ్వంసకర విద్యావిధానం నుంచి ఉపశమనం

పంచాయతీలవారీగా ప్రతిపాదనలకు తుదిరూపునిస్తోన్న విద్యాశాఖ

21న ఏలూరులో ఉమ్మడి జిల్లా విద్యాధికారులతో సమావేశం

ఏలూరు అర్బన్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదురకాల పాఠశాలల వ్యవస్థ.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలో పేతం చేసేందుకు ఓ టానిక్‌లా పనిచేస్తుందని భావి స్తున్నారు. సంస్కరణల మాటున జగన్‌ ప్రభుత్వం తీసుకున్న దుందుడుకు చర్యలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నీరుగారిపోయాయి. కిలోమీటర్ల దూరం లోని హైస్కూళ్లలోకి 3,4,5 తరగతులను విలీనం చేయడంతో వేల సంఖ్యలో విద్యార్థులకు స్థానికంగా చదువుకునే అవకాశం లేకుండా పోయిందనే అభ్యం తరాలను సైతం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 1,2 తరగతుల బాల లకే పరిమితంకాగా, దీనినే సాకుగా తీసుకుని ఉపాఽ ధ్యాయులను బలవంతంగానే ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసింది. గత రెండేళ్లలో ప్రాథమిక పాఠ శాలలు చాలావరకు తగినంతమంది విద్యార్థులు లేక మూతపడే పరిస్థితులు వచ్చాయి. పలు పాఠశాలల్లో సింగిల్‌ డిజిట్‌కు విద్యార్థులసంఖ్య పడిపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన ఐదురకాల పాఠ శాలల విధానంతో ప్రాథమిక పాఠశాలలకు మళ్ళీ పూర్వవైభవం సంతరించుకునే మంచిరోజుల వచ్చా యని చెప్పవచ్చు. కొత్త పాఠశాలల విధానం ప్రకారం ప్రీప్రైమరీ – 1, ప్రీ ప్రైమరీ – 2 (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులతో శాటిలైట్‌ ప్రైమరీ స్కూళ్లు, ఈ రెండు తరగతులకు అదనంగా 1, 2 తరగతులను జోడిస్తూ ఫౌండేషన్‌ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా క్లస్టర్‌ను ప్రామా ణికంగా తీసుకుని ప్రతీ పంచాయతీలో అన్ని మౌలిక సదుపాయాలతో ఒక్కొక్కటి చొప్పున మోడల్‌ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలని ప్రతిపాదించింది. గత వైసీపీ ప్రభుత్వం హైస్కూళ్లకు తరలించిన 3,4,5 తర గతులను ఈ మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలోకి వెనక్కి తీసుకొచ్చి పూర్వపువిధానంలో ఉన్నట్టుగానే మొత్తం ఐదు తరగతులతో నిర్వహిస్తారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటితే ఐదుగురు టీచర్లను ఇవ్వనుండడంతో ఒక హెచ్‌ఎం, ప్రతీ తరగతికి ఒక టీచరు ఉండడంతో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెరగడంతోపాటు, ఉపాధ్యాయులకు సైతం ఉప యుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ పాఠశాలల్లో బాల బాలికల సంఖ్య 31 నుంచి 59 వరకు ఉంటే ఐదు తరగతులనే కొనసాగిస్తూ అక్కడ ఎస్జీటీలతో బోధించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఎస్జీటీల్లో మిగులు (సర్‌ప్లస్‌) సమస్యలు తలెత్తే అవ కాశాలు ఉండక పోవచ్చని చెబుతున్నారు. ఇక ప్రాథ మికోన్నత (అప్పర్‌ ప్రైమరీ) పాఠశాలల్లో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా లేదని గుర్తించిన ప్రభుత్వం ప్రతిపాదిత ఐదురకాల పాఠశాలల విధా నంలో వాటిని సంస్కరించే ప్రయత్నం చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 60కి మించి విద్యార్థు లుంటే వాటిని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయడం, 30 కంటే తక్కువ ఉంటే ప్రాథమిక పాఠశాలగా మార్చ డం వంటి చర్యలు చేపట్టడానికి యోచిస్తున్నారు.

ఉన్నత పాఠశాలలకు మహర్దశ

ప్రాథమిక తరగతులు, పై తరగతుల విద్యార్థులను ఒకేచోటకు చేర్చి బోధనను చేపట్టి జగన్‌ ప్రభుత్వం ప్రైమరీ, హైస్కూల్‌ పిల్లల దృక్ఫథాన్ని అశాస్త్రీయం గా ఒకేగాటన చేర్చి గందరగోళానికి తావిచ్చింది. తాజా విధానంలో హైస్కూలుకు కేటాయించిన 6 నుంచి 10 వరకు తరగతులనే మళ్ళీ ప్రవేశ పెట్టడం వల్ల పలు ప్రయోజనాలుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైస్కూలులో విద్యా ర్థుల సంఖ్య 75 దాటితే హెచ్‌ఎం, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను అద నంగా మంజూరు చేస్తారు. ఆ పైన విద్యార్థుల సంఖ్య 54 దాటితే రెండు సెక్షన్లు, ప్రతీ 10 సెక్షన్లకు హిందీ, ఫిజికల్‌ సైన్స్‌ టీచరుపోస్టు అదనంగా మంజూరు చేయడానికి నూతనవిధానం అవకాశం కల్పిస్తోంది.

మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌తో నాణ్యత గల విద్య

తరగతికో టీచరు పోస్టువల్ల మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుతో క్వాలిటీ ఎడ్యుకేషన్‌ పెరుగుతుం ది. హైస్కూళ్లలో గతంలో ప్రతీ పదిసెక్షన్లకు మొత్తం 13 మంది టీచర్లను ఇచ్చేవారు. కొత్తవిధానంలో టీచర్ల సంఖ్య 15కి పెరుగుతుంది. ఐదురకాల పాఠశాలల విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరగడానికి దారితీస్తుంది.

– వెంకటలక్ష్మమ్మ, డీఈవో

21న ఉమ్మడి జిల్లా సమావేశం

మోడల్‌ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు సన్నాహాలు, బేసిక్‌ ప్రా థమిక పాఠశాలల గుర్తింపు పారద ర్శకంగా జరుగుతోంది. క్లస్టర్లు, మండలస్థాయిల్లో కమి టీలు ఏర్పా టు చేశాం. ఈనెల 17న, 19న నిర్వహిం చే సమా వేశాల్లో చిత్తుప్రతి (రఫ్‌కాపీ)ని సిద్ధం చేస్తాం. దీనిపై తుదిరూపునిచ్చేందుకు ఉమ్మడి పశ్చిమలోని క్లస్టర్ల హెచ్‌ఎంలు, ఎంఈవోలతో ఈనెల 21న ఏలూ రులో పాఠశాలవిద్య డైరెక్టర్‌ విజయరామరాజు సమావేశం నిర్వంచనున్నారు. క్షేత్రస్థాయిలో అభ్యం తరాలు, సందేహాలుంటే నివృత్తిచేసి ఐదురకాల పాఠ శాలల ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వస్తారు.

– సర్వేశ్వరరావు, నూతన పాఠశాలల జిల్లా నోడల్‌ ఆఫీసర్‌

Updated Date - Jan 16 , 2025 | 12:49 AM