ఉత్కంఠభరితంగా కబడ్డీ పోటీలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:43 AM
పట్టణంలోని రుస్తుం బాదా కబడ్డీ స్డేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీ య స్థాయి కబడ్డీ పోటీలు గురువారం మూడో రోజు ఉత్కఠభరింతంగా జరిగాయి.

పురుషుల విభాగంలో దూసుకుపోతున్న సీఆర్‌పీఎఫ్ ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, ఆంధ్ర జట్లు
మహిళా విభాగంలో ఆంధ్రా, ఢిల్లీ, పాటియాల జట్లు
నరసాపురం టౌన్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రుస్తుం బాదా కబడ్డీ స్డేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీ య స్థాయి కబడ్డీ పోటీలు గురువారం మూడో రోజు ఉత్కఠభరింతంగా జరిగాయి. లీగ్ కం నాటౌక్ పద్ధతిలో జరుగుతున్న ఈపోటీలకు పురుషుల విభాగంలో 19, మహిళల్లో 18 రాష్ర్టాల జట్లు తలపడుతున్నాయి. శుక్రవారం సెమీ పైనల్స్‌కు చేరనున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో ఢిల్లీ సీఅర్‌ఫీఎఫ్, జమ్ము కాశ్మీర్, ఆంధ్రా, కొల్‌కత్తా పోలీస్ జట్లు ముందంజలో ఉన్నాయి. మహిళా విభాగంలో ఆంధ్రా, సీఅర్‌పీ ఎఫ్ ఢిల్లీ, పాటియాల జట్లు దూసుకుపోతు న్నాయి. అన్ని జట్లలో జాతీయ స్థాయి క్రీడాకా రులు ఉండడంతో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సెమీఫైనల్స్, పైనల్స్‌కు ఏ జట్లు చేరతాయనేది ఉత్కఠభరితంగా మారింది. పోటీలు తిలకించేందుకు ఉభయగోదావరి జిల్లా ల నుంచి క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కబడ్డీ స్టేడియం కిక్కిరిసి పోయింది. ఆంధ్రా జట్లు తలపడుతున్నప్పుడల్లా ఆభిమానులు కేకలతో ఉత్సాహపరిచారు. గురు వారం పురుషుల విభాగంలో జరిగిన పోటీలో సీఅర్‌ఫీఎఫ్ భువనేశ్వర్‌ను 37 పాయింట్లు, కోల్‌కత్తా పోలీస్ జట్టును కేరళ పోలీస్‌ల మధ్య జరిగిన పోటీలో కోల్‌కత్తా 29 పాయింట్లు, యూపీ – కేరళ మధ్య జరిగిన పోటీలో యూపీ 21 పాయింట్లతో విజయం సాధించాయి. మహిళా విభాగంలో భువనేశ్వర్ జట్టును కేరళ 33, పాటియాల జట్టును రాజస్తాన్ 20, ఫరీదా బాద్ జట్లు భువనేశ్వర్‌పై 23 పాయింట్లతో, ఆంధ్రా ఫరిదాబాద్ జరిగిన హోరాహోరి పోటీలో ఆంధ్రా 9 పాయింట్లతో విజయం సాధించింది. ఈ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బా రాయుడు, కన్వీనర్ జానకిరామ్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సీఈవో వీరలంకయ్య, దొండపాటి స్వామి, ప్రసాద్ తిలకించారు.