కిటకిటలాడిన మావుళ్లమ్మ ఆలయం
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:43 AM
మావుళ్లమ్మ ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.

భీమవరం టౌన్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): మావుళ్లమ్మ ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు అమ్మవారిని అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. శ్రీనివాస కూచిపూడి నృత్య నికేతన్ బృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం హైదరాబాద్‌కు చెందిన సినీ కొరియాగ్రాఫర్, కూచిపూడి బృందం నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలను ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేశ్ పర్యవేక్షించారు. వన్‌టౌన్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.