పారదర్శకంగా 18 మద్యం షాపుల లాటరీ
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:30 AM
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపు లు కేటాయింపు పక్రియను అర్జీదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేశామని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్‌రెడ్డి తెలిపారు.

భీమవరంటౌన్, మార్చి 6 (ఆంధ్ర జ్యోతి) :రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపు లు కేటాయింపు పక్రియను అర్జీదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేశామని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గీత కులాలకు కేటాయించిన 18 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియను టోకెన్ల ద్వారా స్వయంగా ఆయన లాటరీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ కారణంగా వాయిదా పడిన గీత కులాలు మద్యం షాపుల కేటాయింపుల లాటరీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామ న్నారు. జిల్లాలోని 18 మద్యం షాపుల కోసం మొత్తం 478 దరఖాస్తులు అందాయని, ఈ లాటరీ ద్వారా 18 షాపులు కేటాయించామని, రెండు నెలలు ఫీజు రూ.95,83,333 రుసుం జమ చేసిన తరువాత షాపులను కేటాయిస్తామన్నారు. శెట్టిబలిజ–10, గౌడ–5, గౌడ్‌లు–2, శ్రీశయిన ఒక షాపును కేటా యించామన్నారు. మొత్తం 478 దరఖా స్తులకు గాను రూ.9 కోట్ల 56 లక్షలు నాన్ రిఫండబుల్ కింద ప్రభుత్వానికి జమ అయిందన్నారు. మొత్తం ప్రక్రియ వీడియో లైవ్ స్ట్రీమింగు ఇవ్వడంతో పాటు, పక్కాగా రికార్డు చేశామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంటు కమిషనరు కేవీ నాగప్రభుకుమార్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంటు డాక్టర్ ఆర్.ఎస్ కుమారేశ్వరన్, సహాయ ఎక్సైజ్ అధికారి ఆర్‌వీ ప్రసాద్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ, పోలీసులు, అర్జీదారులు పాల్గొన్నారు.