Share News

లేఅవుట్ల క్రమబద్ధీకరణపై నీలినీడలు !

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:49 AM

జిల్లాలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పఽథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తులు పరిష్కారా నికి నోచుకోవడం లేదు. రియల్టర్లు, భూ యజమానులు సరైన పత్రాలు సమర్పించక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అన్న చందాన పరిష్కారం లభించడం లేదు.

లేఅవుట్ల క్రమబద్ధీకరణపై నీలినీడలు !

నాలా చార్జీల పెంపుతో ముందుకురాని రియల్టర్లు

సరైన పత్రాల సమర్పణలోను అవగాహన లేమి

దరఖాస్తుల్లో 50 శాతం కూడా పూర్తి కాని వైనం

ఏలూరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పఽథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తులు పరిష్కారా నికి నోచుకోవడం లేదు. రియల్టర్లు, భూ యజమానులు సరైన పత్రాలు సమర్పించక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అన్న చందాన పరిష్కారం లభించడం లేదు. ఇవి పూర్తయితే పంచాయతీలు, మునిసిపాలి టీల కు ఆదాయం సమకూరుతుంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు కింద ప్రస్తుతం రూ.10వేల చొప్పునే ఫీజులు చెల్లించారు. క్రమబద్ధీకరణ జరిగితే భారీగానే ఆదాయం లభిస్తుంది. క్షేత్రస్థాయి లోనే రియల్టర్లు, యజమానులు, ప్లాట్ల ఓనర్లకు అవగాహన కల్పించలేకపోవడంతో దరఖాస్తులు పరిష్కారం కావడం లేదు. దీందో క్రమబద్ధీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏలూరు అర్బన్‌ అఽఽథారిటీ (యుడా) పరిధిలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 627 పంచాయతీల్లో 1,623 దరఖాస్తులు వచ్చాయి. 485 దరఖాస్తులు క్రమబద్ధీక రణ చేయడానికి ఆమోదం తెలిపారు. 80 తిరస్కరించారు. 225 పరిశీలనలో ఉన్నాయి. 800 కేసుల వ్యవహారాల్లో షార్ట్‌ ఫాల్‌ సర్టిఫికేట్లను సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా పెండింగ్‌ సంఖ్యే పెద్దగా కనిపిస్తోంది.

వైసీపీ ప్రభుత్వంలో 2020 నుంచి పెండిం గ్‌ దరఖాస్తుల పరిష్కారానికి కూటమి ప్రభు త్వం గతేడాది డిసెంబరులో మరో అవకాశం కల్పించింది. ఇది కొందరికి వరంగా మారింది. లైసెన్సు సర్వేయర్లు, సాంకేతిక సహాయకులు కొర్రీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నార ని పలువురు ఆరోపిస్తున్నారు. సమర్పించా ల్సిన పత్రాలను ఎప్పటికప్పుడు తెలియప రచకుండా కాలయాపన చేసి గడువు సమీపించేసరికి ఒత్తిడి చేస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొన్నింటికి కొర్రీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సారైనా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు మోక్షం కలిగేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా అనధికారిక లే–అవుట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. వీటిపై పంచాయ తీల కార్య నిర్వాహణాధికారులు పట్టింపు లేమితో పల్లెలు, పట్టణాల్లో రియల్టర్ల దందా పెచ్చు మీరుతోంది.

పత్రాల సమర్పణ అవసరం..

అనుమతి ఇవ్వాల్సిన దరఖాస్తులు ఎక్కువగా ఉండగా వీటిలో అవసరమైన పత్రాలు సమర్పించనవి ఎక్కువగా ఉండగా, నిర్లక్ష్యంగా వదిలేసినవి కొన్ని ఉన్నాయి. కొన్ని లేఅవుట్లకు రోడ్డు చూపించకపోవడం, నిరభ్యంతర పత్రాలు సమర్పించకపోవడం, భూ వినియోగమార్పిడి చేయకపోవడం వంటివి ఉన్నాయి. లే–అవుట్‌ ప్లాన్‌ మార్చి పంపాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని లే అవుట్లకు సంబంధిత యజమానులు ప్రభుత్వ భూముల నుంచి దారులు చూపించారు. అటువంటి వాటికి కలెక్టర్‌ అనుమతి అవసరం. పలు రకాల సర్వే సమస్యలతో ఆగిపోయినవే ఎక్కువ. నిర్లక్ష్యంగా ఆపేసిన దరఖాస్తులు కొన్ని ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఒకే లే–అవుట్‌లో ఒకే సమస్యతో దరఖాస్తు చేసిన వాటిల్లో కొన్నింటికి గతంలో అనుమతిచ్చి, మరికొందరికీ అనుమతించలేదు.

గడువు పెంచుతూ..

వాస్తవానికి 2020 జనవరిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2019 ఆగస్టు 31కి ముందు రిజిస్ర్టేషన్‌ అయిన ప్లాట్లకు క్రమబద్ధీకరణ వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది. 2022 నాటికే గడువు పెంచుకుంటూ వచ్చింది. చివరకు 2023 వరకు పెంచారు. ఇంకా దరఖాస్తులు భారీగా ఉండి పోవడంతో కూటమి ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. వీటిని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. జనవరి పూర్తయినా చాలా మంది దరఖాస్తుదారులకు సమాచారమే అందలేదు.

ఫీల్డ్‌ స్థాయిలో ఇబ్బందులు

2006కు ముందు స్థలాలు గజాల్లో ఉన్న దానికి ఇప్పుడు నాలా చార్జీలు చె ల్లింపు ప్రక్రియ ఓ ఆటంకంగా చెబుతున్నారు. 2019లో నాలా చార్జీలు (భూమార్పిడి వ్యయం) మూడు నుంచి ఐదుశాతం పెంచడాన్ని లే– అవుట్‌ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల కూడా క్రమ బద్ధీకరణ ముందుకు సాగడం లేదు. ఓపెన్‌ స్పేస్‌ చార్జీల మార్కెట్‌ వాల్యూ ఏటా 10 శాతం పెరగడం వల్ల యజమానులపై భారం పెరుగుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం రూ.10 వేలు కట్టి దరఖాస్తు చేసుకున్న వారు సైతం 2019 ధరలు చూసి లబోదిబో మంటున్నారు. భూములకు సంబంధించి లింకు డాక్యుమెంట్లు సక్రమంగా లేక పోవడం. లే–అవుట్‌లో చూపించిన దానికంటే ఎక్కువ స్థలం దస్తావేజులో ఉండడం తదితర కారణాలతో అవి సవరణలు చేయకపోవడంతో రియల్టర్లు పట్టించుకోవడం లేదు. పంచాయతీలు, మునిసిపాటీలు ఆదాయం కోల్పోతున్నాయి.

Updated Date - Feb 08 , 2025 | 12:49 AM