Share News

భూ రీ సర్వేను వేగవంతం చేయాలి: జేసీ

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:31 AM

గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా చేయా లని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

భూ రీ సర్వేను వేగవంతం చేయాలి: జేసీ
రీసర్వే రికార్డులు పరిశీలిస్తున్న జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

నరసాపురం రూరల్‌, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా చేయా లని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మల్లవరం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే తీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. గ్రామం లో చేపట్టే రీ సర్వేకు ముందుగా రైతులకు సమాచారం అందించాలన్నారు. వారి సమక్షంలో పారదర్శకంగా సర్వే చేపట్టాలన్నారు. సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సర్వేలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన పి.చిట్టిబాబు లిఖితపూడిలో ఉన్న భూమిని సక్ర మంగా రీ సర్వే చేయలేదని జెసీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మళ్లీ రీ సర్వే చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలన్నారు. ఆనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో నరసాపురం, మొగల్తూరు, పొడూరు మండలాలకు చెందిన రీ సర్వేకు వచ్చిన రికార్డులు, దరఖాస్తులను ఆయన పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీవో దాసిరాజు, సర్వేయర్‌ కరుణకుమార్‌, డీటీ కిషోర్‌, వీఆర్వో లక్కు స్వామి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:31 AM