Share News

జనసేన నేతపై చింతమనేని అనుచరుల దాడి

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:13 AM

జనసేన పార్టీ నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాముపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు.

జనసేన నేతపై చింతమనేని అనుచరుల దాడి
త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న జనసేన నాయకులు

ఫిర్యాదు చేసి 3 రోజులైనా పట్టించుకోని పోలీసులు

ఏలూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద నూజివీడు నేతల ఆందోళన

ఏలూరు క్రైం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాముపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. ఏలూరు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద గురువారం బైఠాయించి నినాదాలు చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన అధికార ప్రతినిధి శివరామకృష్ణ మాట్లాడుతూ ఈనెల 28న దుగ్గి రాలలో జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాముపై దెందులూరు ఎమ్మెల్యే చిం తమనేని ప్రభాకర్‌ అనుచరులు దాడి చేశార న్నారు. రాము కౌలుకు తీసుకున్న చెరకు తోటలో పనిచేసుకుంటుండగా దాడి చేసి దుర్భాషలాడార న్నారు. రాము దాడి విషయాన్ని పసిగట్టి త్రీ టౌన్‌ సీఐకు ఫోన్‌ చేసి రక్షణ కల్పించాలని కోరి నా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. కూట మి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చింతమనేని ఆరాచకాలు పెరిగాయన్నారు. రామును ఇబ్బంది పెడుతు న్నారని లోకేశ్‌, జనసేన కేంద్ర కార్యాలయానికి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో కూడా ఫిర్యా దు చేశారన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టా రంటూ రాముపై త్రీ టౌన్‌లో కేసు పెట్టించారన్నారు. అవ మానించినా తట్టుకున్నాం, మీటింగ్‌లకు పిలవకపోయినా తట్టుకున్నాం కానీ భౌతికంగా దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, నిందితులను తక్షణమే అరెస్టు చేసి చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధితు డు రాము మాట్లాడుతూ 2014 నుంచి దుగ్గిరాల సమీపంలో పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవ సాయం చేస్తున్నానన్నారు. 28న చెరుకు నరికి స్తుంటే చింతమనేని అనుచరులు కూలీలను బెదిరించారని, చింతమనేనిపై పోస్టులు పెడతా వా అంటూ తనపై దాడి చేశారన్నారు. తనలో ఉన్న మరో యువకుడి సెల్‌ఫోన్‌, తన సెల్‌ఫోన్‌, జేబులో ఉన్న రూ.7 వేలు కాజేశారని తెలిపారు. ప్రాణభయంతో పారిపోయామని, త్రీ టౌన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేసులు నమోదు

యర్రంశెట్టి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతమనేని గోపీ, వడ్లపట్ల బాబు, మధు, మరో ఇద్దరిపై ఏలూరు త్రి టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దుగ్గిరాల వీఆర్వో తిరువీధుల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు యర్రంశెట్టి రాముపై కేసు నమోదు చేసి త్రీ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jan 31 , 2025 | 12:13 AM