Share News

1 నుంచి వంతుల విధానం

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:38 AM

దాళ్వాలో వంతుల వారీ విధానంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సాగు నీటిని విడుదల చేయనున్నారు.

1 నుంచి వంతుల విధానం

డెల్టాలో 11 ప్రధాన కాలువలకు

రెండు విడతలుగా పంపిణీ

ఒక్కో విడతకు ఆరు రోజుల చొప్పున సాగు నీరు విడుదల

భీమవరం రూరల్‌, జనవరి 29 (ఆంధ్ర జ్యోతి): దాళ్వాలో వంతుల వారీ విధానంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సాగు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలోని 11 ప్రధాన కాల్వలను రెండు భాగాలుగా విభజించి రెండు విడతలుగా నీటిని అందిస్తారు. విడతకు ఆరు రోజుల చొప్పున విడుదల చేస్తారు. ఇప్పటికే దాళ్వా సాగు నాట్లు చివరి దశకు చేరుకున్నా యి. 2.20 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తవగా, మరో ఐదు వేల ఎకరాలు రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

వంతుల వారీ విధానం ఇలా..

మొదటిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆరో రోజు ఉదయం ఆరు గంటల వరకు ఒక వంతు, ఏడో రోజు ఉదయం ఆరు గంటలనుంచి 13వ రోజు ఉదయం ఆరు గంటల వరకు రెండో వంతు (టర్న్‌ సిస్టం) విధానంలో నీటిని అందిస్తారు.

Updated Date - Jan 30 , 2025 | 01:38 AM