గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతం
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:24 AM
గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష నిర్వ హణపై శనివారం సందిగ్ధత నెలకొన్నా పరీక్ష యధాతథంగా కొనసాగుతుం దని ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.

మొత్తం అభ్యర్థులు 4,415 మంది
\ఉదయం 3,881 మంది, మధ్యాహ్నం 3,878 మంది హాజరు
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష నిర్వ హణపై శనివారం సందిగ్ధత నెలకొన్నా పరీక్ష యధాతథంగా కొనసాగుతుం దని ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి సంబంధిత పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 4415 మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకోగా, ఉదయం పేపర్–1 పరీక్షకు 3881మంది (87.90శాతం), మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 3878 మంది (87.81శాతం) హాజరయ్యారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి, ఎస్పీ కేపీఎస్.కిశోర్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఆర్డీవో అంబరీష్, తదితరులు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
అభ్యర్థుల హడావుడి
గ్రూప్–2 మెయిన్స్ అభ్యర్థులకు ముందస్తు జాగ్రత్తలు సూచించినా అభ్యర్థులు హడావుడిలో ఇబ్బందులు పడ్డారు. వట్లూరులో సీఆర్‌ఆర్ విద్యా సంస్థలకు చెందిన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మహిళా కళాశాలల్లో పరీక్ష పరీక్ష కేంద్రా లున్నాయి. హాల్‌టికెట్‌పై వివరాలు స్పష్టంగా ఉన్నా కొందరు అభ్యర్థులు తడబడ్డారు. సీఆర్‌ఆర్ పేరునే చూశారు తప్ప కేటాయించిన కళాశాల వివరాలను పట్టించుకోకుండా ఆయా కళాశాలల చుట్టూ తిరి గారు. కొందరైతే పరీక్ష గదుల్లోకి వెళ్లి మరో కళాశాలకు వచ్చామని తెలుసుకుని సంబంధిత కేంద్రానికి పరుగులు తీశారు. మరికొందరు హాల్‌టిక్కెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు లేకుం డా వచ్చారు. అభ్యర్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం సమీపంలోని చెట్లు, భవనాల నీడకు చేరుకున్నారు. మధ్యాహ్నం పేపర్–2 పరీక్షకు ముందు పరీక్ష కేంద్రాల క్యాంటీన్లు, బయట హోటళ్లను ఆశ్రయించారు.
సహకరించిన పోలీసులు
ఏలూరు క్రైం: గ్రూపు 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నగరంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పికెట్లలో ఉన్నారు. పరీక్షా కేంద్రాల చిరునామా తెలియని అభ్యర్థులకు పోలీసులు సహకరించారు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు పరుగున వెళుతున్న కొందరు అభ్య ర్థులను గుర్తించి మోటార్ సైకిల్‌పై సంబంధిత పరీక్షా కేంద్రానికి చేర్చారు. అభ్యర్థులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా పోలీస్ వాహనాలు, బ్లూ కోట్స్ వాహనాలతో పర్యటించి చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కేపీఎస్ కిశోర్ సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు.