మావుళ్లమ్మ ఆలయంలో అన్నసమారాధన
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:51 AM
నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మావుళ్లమ్మ ఆలయ 61వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అన్నసమారాధన నిర్వహించారు.

మహాకుంభానికి ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దంపతుల పూజలు
వేలంలో రూ.1.10 లక్షలు పలికిన 36 కేజీల లడ్డూ
భీమవరం టౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మావుళ్లమ్మ ఆలయ 61వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అన్నసమారాధన నిర్వహించారు. తొలుత అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉంచిన మహాకుంభానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు పూజలు చేశారు. మహాకుంభానికి నివేదన చేసి హారతి ఇచ్చిన తర్వాత సమారాధనను ప్రారంభించారు. భక్తులు అందించిన బూరెలు, గారెలు, పలురకాల స్వీట్లు, చనివిడి పానకాలు మహాకుంభంపై ఉంచారు. దాదాపు 60 వేల మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించేందుకు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. మూడు గంటల వరకు రద్దీ కొనసాగింది. జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, టీడీపీ నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ళ నాగేశ్వరరావు, ఎం.నారాయణమ్మ, పి.బాపిరాజు, సంఘ సభ్యులు ఉన్నారు.
భారీ బందోబస్తు
ఆలయ పరిసర ప్రాంతాల్లో డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బఫే విధానంలోను, మరోచోట సిట్టింగ్‌లోను భక్తులకు ప్రసాదాన్ని కమిటీ సభ్యులు అందించారు. క్యూలైన్‌లో వున్న వారికి మావుళ్లమ్మ యూత్ సభ్యులు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు అందించారు.