ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇక నామినేషన్
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:45 AM
ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామి నేషన్ల స్వీకరణ తొలిరోజు సోమవారం ఒక నామినేషన్ దాఖలైంది.
ఈ నెల 10 వరకు స్వీకరణ.. 8, 9 తేదీల్లో సెలవు
ఏలూరు సిటీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామి నేషన్ల స్వీకరణ తొలిరోజు సోమవారం ఒక నామినేషన్ దాఖలైంది. కాకినాడకు చెందిన పేప కాయల రాజేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వికి పేపకాయల రాజేంద్ర ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అభ్య ర్థి రాజేంద్రతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. సోమవారం నామినేషన్లు స్వీకరణ చేపట్టగా ఈనెల 10 వరకు గడువు ఉంది. మధ్య లో ఈనెల 8, 9 తేదీలు సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఏలూరు కలెక్టరే ట్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 11న పరిశీలన, 13న మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. మార్చి 3న ఏలూరులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎమ్మె ల్సీ ఎన్నికలకు 440 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. వీటిలో 3,15,261 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
ఆర్వో, కలెక్టర్ వెట్రిసెల్వి
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీ య పార్టీలు సహకరించాలని రిటర్నింగ్ అధికా రి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతిని ధులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో అల్లూరి సీతారా మరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మొత్తం 440 పోలింగ్ కేంద్రా లు ఉన్నాయన్నారు. 3,15,261 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉం టుందన్నారు. ఇప్పటివరకు అందిన 8,501 క్లెయిమ్‌లు పరిశీలించి 5వతేదీలోపు ఈఆర్‌వో నెట్‌లో అప్‌డేట్ చేస్తామన్నారు.
ఏలూరు డివిజన్‌లోని 8మండలాల్లో 37 పోలింగ్ స్టేషన్లు, జంగారెడ్డిగూడెం డివిజన్‌లోని 10 మండలాల్లో 23 పోలింగ్ స్టేషన్లు, నూజివీడు డివిజన్‌లోని 2 మండలాల్లో 6 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి 440 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిని అనుబంధంగా 16 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదిం చడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి ఏఆర్‌వోగా డిప్యూటి కలెక్టర్ ఎం ముక్కంటి వ్యవహరిస్తారన్నారు. ఏలూరు జిల్లా లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లాలో 16,077 మంది ఓటర్లు ఉండగా 9858 మంది పురుషులు, 6218 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జండర్ ఉన్నార న్నారు. 20 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించటం జరిగింద న్నారు. సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధి కారి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నెరుసు నెలరాజు, ఎస్ అచ్యుతబా బు, యు.బాలానందం, ఎస్.సత్యనారాయణ, సిర్రా భరత్, ఎస్‌కె.బాషా, ఎస్ ఆదిశేషు, తదితరులు పాల్గొన్నారు.