Share News

ఇరు వర్గాల ఘర్షణ

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:41 AM

ఇరువర్గాల మధ్య పెళ్లిలో జరిగిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒకరి పై ఒకరు రాళ్లు రువ్వుకునేంత వరకు వెళ్లింది.

ఇరు వర్గాల ఘర్షణ
రాళ్లు రువ్వుకుంటున్న రెండు వర్గాలు..

ఒకరిపై మరొకరు రాళ్లు, కర్రలతో దాడులు

ముగ్గురికి గాయాలు..

ఆసుపత్రికి తరలింపు

పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

నరసాపురం అరుంధతీపేటలో ఘటన.. 144 సెక్షన్‌ విధింపు

నరసాపురం టౌన్‌, ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి):ఇరువర్గాల మధ్య పెళ్లిలో జరిగిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒకరి పై ఒకరు రాళ్లు రువ్వుకునేంత వరకు వెళ్లింది. ఈ దాడిలో పలువురికి గాయాల య్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వారు తెలిపిన వివరాలివి.. నరసాపురం అరుంధతీపేటలో గురువారం రాత్రి ఓ వివాహం జరుగుతోంది. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వెళుతున్న ఓ వ్యక్తి హారన్‌ కొట్టడంతో మొదలైన వివాదం.. రెండు సామాజిక వర్గాల గొడవగా మారింది. అప్పటి నుంచి పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ననే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఉదయం వరకు చాప కింద నీరులా వున్న రెండు వర్గాలు సాయంత్రం మళ్లీ ఘర్షణలకు దిగాయి. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒక్కరూ దాడికి పాల్పడారు. రెండు వర్గాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. నువ్వెంత అంటూ నువ్వె ంత అంటూ కేకలు వేసుకున్నారు. ఒక్కసారిగా రెండు వర్గాల ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భయానక వాతావరణం ఏర్పడింది. అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అంతర్వేది ఉత్సవాల సందర్భంగా నరసాపురం రేవులో బందోబస్తులో వున్న నరసా పురం డీఎస్పీ శ్రీవేదకు సమాచారం రావడంతో అక్కడ గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరిని ఇటు తీసుకుని వచ్చారు. వీరు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికి రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోడం ఆపలేదు. అడ్డువచ్చిన పోలీ సులపై రాళ్లు రువ్వారు. దీంతో అదనపు పోలీస్‌ బందోబస్తును రప్పించి పేటలో మోహరి ంచారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఈ ఘటన వివరాలను డీఎస్పీ సేకరిస్తున్నారు. మళ్లీ ఇటు వంటి ఘటనలు జరిగే కఠిన చర్యలు తీసు కుంటామని రెండు వర్గాలను హెచ్చరించారు. ఇక్కడ 144 సెక్షన్‌ విధించి గస్తీ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల దాడులతో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వా సుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెల్లిపేటకు చెందిన నీలపు చినబాబుపై అరుంధతీపేటకు చెందిన సిర్రా ప్రదీప్‌ దాడి చేశాడని, అలాగే అరుంధతీపేటకు చెందిన సిర్రా ప్రదీప్‌ కుమార్‌పై రెల్లిపేటకు చెందిన నీలాపు ప్రసాద్‌, చిన్నబాబు, భరత్‌ నాంచారి, రత్నరాజు దాడి చేసి గాయపర్చారని ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 12:41 AM