Share News

వేసవిలో పుష్కలంగా తాగునీరు

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:40 AM

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. సమ్మర్‌ క్రాష్‌ ప్రోగ్రాం (అత్యవసరంగా చేసే పనులు)తో గ్రామాల్లోని మంచినీటి పథకాల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.

వేసవిలో పుష్కలంగా తాగునీరు

వేసవికి ముందే అధికారుల కార్యాచరణ

సమ్మర్‌ క్రాష్‌ ప్రోగ్రాం ద్వారా సమస్యల పరిష్కారంపై దృష్టి

ప్రతి వారం మంచినీటి పథకాలను పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు

మంచినీటి చెరువుల్లో నీటి పరిమాణంపై పంచాయతీలకు సూచనలు

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. సమ్మర్‌ క్రాష్‌ ప్రోగ్రాం (అత్యవసరంగా చేసే పనులు)తో గ్రామాల్లోని మంచినీటి పథకాల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. తాగునీరందడంలో సమస్య ముందుగా గుర్తించి తగిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మంచినీటి చెరువుల్లో నీరు నింపుతున్నారు. కొన్ని చెరువులు, ఫిల్టర్‌ బెడ్‌లు అభివృద్ధి చేస్తున్నారు.

మంచినీటి పథకాలలోని చెరువులు నీటి నింపుదలలో కాళ్ళ, నరసాపురం, మొగల్తూరు, భీమవరం మండలాల్లో 30 చెరువులు సమస్యాత్మకంగా గుర్తించారు. దిగువన ఉండడం వల్ల కాలువ నీటి ప్రవాహం తక్కువ. ఈ 4 చెరువుల్లో నీరు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు.

భీమవరం రూరల్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 305 మంచినీటి చెరువులు, ఫిల్టర్‌ బెడ్‌లు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ (ఓహెచ్‌ఆర్‌) పరిశీలించిన అధికారులు నెల రోజుల క్రితం ప్రణాళిక సిద్ధం చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుం డా ముందుగానే చర్యలు తీసుకున్నారు. చెరువులలో నీరు నింపడం, నీటి పరిమాణం ఎప్పటికప్పు డు గమనించడంపై పంచాయతీ అధికారులకు సూచనలు ఇచ్చారు. చెరువుల నీటిమట్టం నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో అధికార యంత్రాంగం తాగునీటి పథకాలపై ప్రధాన దృష్టి సారించారు. చిన్న చెరువులు, మట్టితో పూడుకుపోయిన చెరు వుల అభివృద్ధిపై దృష్టి సారించారు. కొన్ని చోట్లచెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు.

ఫిల్టర్‌బెడ్‌ మరమ్మతులు

తాగునీరు స్వచ్ఛతకు ప్రధానంగా ఉపయోగపడే మంచినీటి పథకంలోని ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతులు తక్షణం పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో పలు చోట్ల ఫిల్టర్‌బెడ్‌లు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇతర సమస్యలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గుర్తించి వాటికి అంచనా లు రూ పొందించి పంచాయతీ, మండల పరిషత్‌లకు పంపించారు. పదుల సంఖ్యలో మంచినీటి పథకాల సమస్యలు గుర్తించారు.

తాగునీటిపైనే పాలకవర్గాల దృష్టి

గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధిలో పంచాయతీలు వెనుకబడ్డాయి. నిధులు లేకపోవడం, 15వ ఆర్థిక సంఘం నిధులు గత ప్రభు త్వం వెనక్కి తీసుకోవడంతో మం చినీటి పథకాల మరమ్మతులకు సొమ్ములు లేవు. ఇటీవల ఉపాధి నిధులతో సీసీ రహ దారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉండడంతో ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతులు, ఇతర పనులు చేసి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే దిశగా పంచాయతీ పాలకవర్గాలు అడుగులు వేస్తున్నాయి.

Updated Date - Mar 08 , 2025 | 01:40 AM