భీమవరంలో బధిరుల టీ–20
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:07 AM
బధిరులు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటు న్నారని, క్రికెట్‌లో ఛాంపియన్‌షిప్ స్థాయికి వెళ్లడం అభినందనీయమని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు.

12, 13 తేదీల్లో పోటీలు
పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
భీమవరంటౌన్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): బధిరులు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటు న్నారని, క్రికెట్‌లో ఛాంపియన్‌షిప్ స్థాయికి వెళ్లడం అభినందనీయమని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. 5వ రాష్ట్రస్థాయి బధిరుల టీ–20 క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల బ్రోచర్ ఎమ్మెల్యే అంజిబాబు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 5వ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించ డం అభినందనీయమని, తన వంతు సహకారం అందిస్తానన్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చెరుకువాడ రంగసాయి, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతిరాజు మురళీ కృష్ణంరాజు, సీహెచ్ తాతారావు మాట్లాడుతూ ఈనెల 12,13 తేదీల్లో గన్నాబత్తుల క్రీడా మైదానంలో బధిరుల టీ–20 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 10 టీమ్‌లు పాల్గొంటున్నాయని, డీఎన్నార్ కళాశాల అధ్యక్షుడు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనా రాయణ రాజు(బాబు) సహకారం అందిస్తామని తెలిపారన్నారు. దాతలు, క్రీడా అభిమానుల సహకార సౌజన్యంతో పోటీలను నిర్వహిస్తు న్నామన్నారు. గతంలో నాలుగు సార్లు భీమవరంలోనే పోటీలను నిర్వహించామని, ఈ ఏడాది కూడా భీమవరంలోనే చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, అసోసియేషన్ సభ్యులు ఎస్‌ఎస్ శర్మ, ఎండి రఫి, జి.రామచంద్రరావు, ఆర్.ఉమా మహేష్, తదితరులు పాల్గొన్నారు.