రేపు సీఎం పెనుగొండ రాక
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:41 AM
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేం దుకు ఈ నెల 31న సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పెనుగొండ రానున్నా రు.

వాసవీ మాత ఆత్మార్పణ దినం.. పెనుగొండలో చంద్రబాబు పూజలు
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పితాని
పెనుగొండ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేం దుకు ఈ నెల 31న సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పెనుగొండ రానున్నా రు. శ్రీ నగరేశ్వర, మహిషాసుర మర్ధని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలె క్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి, సీఎం సెక్యూరిటీ పర్యవేక్షకులు అడిషనల్ ఏస్పీ రమణ తదితరులు పరిశీ లించారు. ఏఎంసీలో నిర్మిస్తున్న హెలిప్యాడ్ కాంక్రీట్ పనులను పరిశీలించి ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచనలు చేశారు. యార్డు ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. నగరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న నిత్యాన్నదాన సత్రం ప్రాంగణంలో ఈ నెల 31న హోమం నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. గోశాలను పరిశుభ్రంగా ఉంచి ముగ్గులతో అలంకరించేలా చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ అధికారిని ఆదేశించారు. శ్రీ వాసవి శాంతి ధామ్ ౠషి గోత్ర సువర్ణ మందిరాన్ని సందర్శించి ఆలయ ట్రస్టీ డాక్టర్ పీఎన్ గోవిందరాజులతో శాంతి ధామ్‌లో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఏ విధమైన లోటు పాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. దేవదాయ శాఖ ఆర్‌జేడీ కె.సుబ్బారావు, ఏఎస్పీ వి.భీమారావు, ఆర్‌డీవోలు దాసిరాజు, ఖతీబ్ కౌసర్ భానో, సర్పంచ్‌లు నక్కా శ్యామల, తహసీల్దార్ అనిత కుమారి, ఎంపీడీవో టి.ఎస్.మూర్తి, వాసవి ధామ్ సెక్రటరీ కె.రాజా పాల్గొన్నారు.