Share News

చికెన్‌.. తగ్గెన్‌..!

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:33 AM

బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌ ధర.. అమ్మ కాలు తగ్గిపోయాయి.

చికెన్‌.. తగ్గెన్‌..!
ఏలూరులో కిటకిటలాడుతున్న చేపల దుకాణాలు

వెలవెలబోయిన దుకాణాలు

మటన్‌, చేపలకు డిమాండ్‌

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌ ధర.. అమ్మ కాలు తగ్గిపోయాయి. ఆదివారం చికెన్‌ దుకా ణాలు కొనుగోలుదార్లతో కిటకిటలాడేవి. అమ్మకాలు పెరిగేవి. అలాంటిది ఈ ఆదివా రం చికెన్‌ దుకాణాలు వెలవెలబోతే మటన్‌, చేపల దుకాణాలు రద్దీగా కనిపించాయి. ఏలూరు వన్‌టౌన్‌, టూటౌన్‌ చేపల మార్కెట్‌, చేపల తూం సెంటర్‌ కిటకిటలాడింది. చికెన్‌ వద్దు అనుకున్నవారిలో అత్యధికులు చేపలు, మటన్‌ వైపు మొగ్గు చూపారు. ఉదయం 6 గంటలనుంచే చేపల మార్కెట్‌కు తరలి వచ్చారు. కొన్నిరకాల చేపల ధరలు పెరిగినా కొనుగోళ్లు తగ్గలేదు. చికెన్‌ కేజి రూ.120 చొప్పున విక్రయించినా అమ్మకాలు లేవు. మటన్‌ ధర కేజీ రూ.800 నుంచి అమాంతం వెయ్యి రూపాయలకు పెంచారు.

చికెన్‌ మేళాకు పోటెత్తారు!

ఒకవైపు చికెన్‌ అమ్మకాలు పడిపోతే.. అవగాహన కోసం నిర్వహించిన చికెన్‌ మేళాకు జనం పోటెత్తారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఆదివారం జిల్లా పౌల్ర్టీ ఫార్మర్స్‌, ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటుచేసిన చికెన్‌, గుడ్లు, ఆహార మేళా లో చికెన్‌ పలావ్‌, చికెన్‌ ఫ్రై, లాలీపాప్‌, ఎగ్‌కర్రీ వంటకాలను ఆరగించారు. జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి గోవిందరాజు మాట్లా డుతూ ఉడికించిన చికెన్‌, గుడ్లను తినవచ్చని తెలిపారు. అసత్య ప్రచారంతో చికెన్‌, గుడ్లు వ్యాపారం దారుణంగా పడిపోయిందని, జిల్లా పౌల్ర్టీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్‌ మేళాకు పెద్దఎత్తున ప్రజలు ఎగబడ్డారు.

Updated Date - Feb 24 , 2025 | 12:33 AM