638 సెల్‌ఫోన్లు.. బాధితులకు అందజేత
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:47 AM
జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న వారివి 14వ సారి రికవరీ చేసి అందరికీ తామే స్వయంగా అందిస్తున్నామని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు.

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 12 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో మొబైల్స్ పోగొట్టుకున్న వారివి 14వ సారి రికవరీ చేసి అందరికీ తామే స్వయంగా అందిస్తున్నామని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు. సెల్‌ఫోన్లను బాధితులకు అందించే కార్యక్రమాన్ని ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిఽథిగా హాజరై స్వయంగా ఫోన్లను వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్ళి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిశోర్ మాట్లాడుతూ 14వ సారి తాము రికవరీ చేసిన ఫోన్లు 638 మొబైల్స్ అని, వీటి విలువ రూ.76 లక్షల 56 వేలు అన్నారు. ఈ ఫోన్లను ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగ రం, తెలంగాణా, కేరళ, మహారాష్ట్ర, తమిళ నాడు తదితర ప్రదేశాల్లో వినియోగిస్తున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండు వేల 398 ఫోన్లను రికవరీ చేశామని వాటి విలువ నాలుగు కోట్ల 6 లక్షల 39 వేల 684 రూపాయలు విలువ అని చెప్పారు. ఎవరైనా దొంగ ఫోన్లు కొనుగోలు చేసినా, విక్రయించినా ఆ ఫోన్లు వాడినా వారిపై సెక్షన్ 317 భారతీయ న్యాయ సంహిత 2023 చట్ట ప్రకా రం మూడు సంవత్సరాలు జైలు శిక్ష అను భవించాల్సి ఉంటుందని వివరించారు. ప్రజలు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవా లన్నారు. ఎవరైనా అనుచిత వీడియో కాల్స్ కాని, రకరకాల కాల్స్ చేసినా భయపడవద్దని వెంటనే పోలీసులకు సమాచారం అందిం చాలన్నారు. అనుమానిత లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే సమీప పోలీస్ స్టేషన్‌లో సీఇఐఆర్ పోర్టల్ ద్వారా వెంటనే రిపోర్టు చేయాలని సూచించారు. దొంగిలించబడిన ఫోన్లు రికవరీ ప్రయత్నాలు వేగవంతం చేయడానికి సీఇఐఆర్ పోర్టల్ సహాయ పడుతుందని వివరించారు.
సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు ఖచ్చితంగా అందుకు సంబంధించిన బిల్లులు చూసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ఫోన్లను అమ్మిన తరువాత అవి దొంగ ఫోన్లుగా నిర్ధారణ జరిగిన షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్ర మంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్‌కుమార్, ఏలూరు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఏలూరు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, త్రి టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్యనా రాయణ పలువురు పాల్గొన్నారు.