Share News

వంతెనల నిర్మాణం నత్తనడక

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:51 AM

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలో పలు వంతెనలు నిర్మాణాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. నిధులు మంజూరు కాక, కాంట్రాక్టర్లకు బిల్లుల పెండింగ్‌తో పనులు ముందుకు సాగ లేదు.

వంతెనల నిర్మాణం నత్తనడక
అసంపూర్తిగా నిలిచిన పట్టెన్నపాలెం బ్రిడ్జి

ఏళ్ల తరబడి సాగుతున్న పనులు

జల్లేరు వంతెనపై ఆగని ప్రమాదాలు

గుండుగొలనులో మెటీరియల్‌ చోరీ

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలో పలు వంతెనలు నిర్మాణాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. నిధులు మంజూరు కాక, కాంట్రాక్టర్లకు బిల్లుల పెండింగ్‌తో పనులు ముందుకు సాగ లేదు. కూటమి ప్రభుత్వమైనా ఆయా వంతెనలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

జల్లేరుపై భయం.. భయం..

ఏలూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెంలో జల్లేరు వాగుపై వంతెన నిర్మాణ పనులు ఏడేళ్లుగా నిలిచిపోయాయి. తాత్కాలిక అప్రోచ్‌ రోడ్డుపై రాకపోకలతో తరచూ ప్రమాదాలు జరు గుతున్నాయి. 2018లో టీడీపీ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేసింది. పిల్లర్ల నిర్మాణం తర్వాత పనులు ముందుకు సాగలేదు. పనులు చేపట్టిన కాంట్రా క్టరు సబ్‌ కాంట్రాక్టుకు ఇవ్వడంతో బిల్లులు ఇవ్వడం లేదని సబ్‌ కాంట్రాక్టరు మధ్యలోనే పనులను నిలిపివేశారు. సుమారు రూ.1.80 కోట్లు పనులు పూర్తి చేయగా రూ. 3.20 కోట్లు పనులు చేయాల్సి వుంది. ఆర్‌అండ్‌బీ డీఈ సీహెచ్‌.హరికృష్ణను వివరణ కోరగా రూ.3.20 కోట్లు మంజూరు కొరకు డిజైన్స్‌ అండ్‌ ప్లానింగ్స్‌ శాఖకు పంపినట్టు తెలిపారు. అనుమతిరాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.

గుర్వాయిపాలెం వంతెన అప్రోచ్‌ లేదు!

కలిదిండి: గుర్వాయిపాలెం వంతెన అప్రోచ్‌ రోడ్డు కోత కు గురై ప్రమాదకరంగా మారడంతో తరచు రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయి. అప్రోచ్‌ రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్‌ లేక వాహనాలు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడుతున్నాయి. పెదలంక, మూల్లంక, భాస్కరావుపేట, సంతోషపురం, కొత్తూరు, గుర్వాయిపాలెం పంచాయతీల పరిధిలో ప్రజలు ఈ రోడ్డుపై నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఐదేళ్లుగా రోడ్డుకు ఇరు పక్కల రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని పాలకులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అప్రోచ్‌ రోడ్డుకు ఇరుపక్కల రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా రు. ఈ విషయమై ఆర్‌ అండ్‌బీ ఏఈఈ అరవింద్‌ను వివరణ కోరగా, గుర్వాయి పాలెం నుంచి పెదలంక రోడ్డు నిర్మాణాని కి రూ.80 లక్షలు మంజూరయ్యాయని త్వరలో అప్రోచ్‌ రోడ్డుకు ఇరుపక్కల రెయిలింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మూడేళ్ల నుంచి నిర్మాణం..!

దెందులూరు: గుండుగొలను వంతెన నిర్మాణ పను లు మూడేళ్లుగా నత్తనడకన జరుగుతున్నాయి. కాంట్రా క్టర్‌ నిర్లక్ష్యానికి తోడు నిర్మాణ సామగ్రి చోరీ, కాల్వలో నీటి పారుదలతో పనులు జాప్యమయ్యాయి. ఇప్పటి వరకు వంతెన నిర్మాణం 70 శాతం పూర్తయింది. వంతెన లేక గుండగొలను, పోతునూరు, లక్ష్మీపురం, భోగాపురంతో పాటు 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండుగొలను గ్రామ వెళ్లాలంటే సుమారు 600 మీటర్లు రాంగ్‌ రూట్‌లో వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా గత మూడేళ్లలో నలుగురు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. సుమారు 11 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 16 మంది గాయాల పాలయ్యారు. త్వరితగతిన వంతెన పనులు పూర్తి చేయాలని అయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:51 AM