Share News

అమ్మో.. అమెరికానా ?

ABN , Publish Date - Feb 09 , 2025 | 01:16 AM

అటు ఉపాధి కోసం.. ఇటు ఉన్నత చదువులు, ఆపై మెరుగైన జీవితం కోసం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏటా వందల సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఇలా వెళ్లిన వారిలో కొద్ది మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నారు. ఎక్కువ మంది మోసాలకు గురవుతూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.

 అమ్మో.. అమెరికానా ?

గుబులు రేపుతున్న ట్రంప్‌ నిర్ణయం

అక్కడ చదువుతున్న.. ఉద్యోగాలు చేస్తున్న జిల్లావాసుల కుటుంబీకుల్లో ఆందోళనలు

గల్ఫ్‌ దేశాలపట్ల పెరుగుతున్న విముఖత

ఏజెంట్లు, దళారుల చేతుల్లో మోసాలు

ఉపాధి అవకాశాల పేరిట విజిటింగ్‌ వీసాలు

అక్కడకు వెళ్లి ఇరుక్కుపోతున్న బాధితులు

అటు ఉపాధి కోసం.. ఇటు ఉన్నత చదువులు, ఆపై మెరుగైన జీవితం కోసం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏటా వందల సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఇలా వెళ్లిన వారిలో కొద్ది మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నారు. ఎక్కువ మంది మోసాలకు గురవుతూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయంతో విదేశీయానంపై ఆశలు సన్నగిల్లాయి. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

ఏజెంట్‌ చేతిలో మోసపోయా..

యలమంచిలి మండలానికి చెందిన ప్రకాశ్‌ ఉపాధి కోసం రెండు లక్షలు ఇస్తే మలేషియా పంపుతానని ఓ ఏజెంటు నమ్మబలికాడు. సరేనని సొమ్ము ఇస్తే మలేషియా కాకుండా దుబాయ్‌లో దింపాడు. అక్కడ వీసా ఇబ్బందులతో వారంపాటు నిర్భందించారు. మలేషి యా వెళ్లిన తర్వాత అక్కడే అదే నిర్బంధం. చివరకు ఏదో లా బయటపడి తెలిసిన తెలుగు వాళ్ల సాయంతో రోజుకు ఒక చపాతి తిని గడిపాను. ఏజెంట్‌ పాస్‌పోర్టు తీసేసుకో వడంతో అక్కడ రాత్రి వేళల్లో కంపోజింగ్‌ పనిలో మూడు నెలలు పనిచేసి కొంత సొమ్ము కూడగట్టుకుని మళ్లీ పాస్‌ పోర్టు సంపాదించుకున్నా. ఆరు నెలల తర్వాత గాని ఇంటి కి ఫోన్‌ చేసుకునే అవకాశం రాలేదు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండటంతో ఇప్పుడు మలేషియాలో జాబ్‌ చేసుకుంటున్నా. సరైన పత్రాలు లేక వందల మంది ఎయిర్‌పోర్టు నేల మాడుగుల చీకటి గదుల్లో ఖైదీలుగా మగ్గుతూనే ఉన్నారు.

దుబాయ్‌లో దుర్భర జీవితం

‘దుబాయ్‌లో ఎనిమిదేళ్లుగా దుర్భర జీవితం గడుపుతు న్నా. షార్జా ఎయిర్‌పోర్టులో పని ఇప్పిస్తానని ఏజెంట్‌ తీసు కు వెళితే అక్కడ మూడేళ్లు పనిచేశా. అక్కడ ఒక పాకి స్తాన్‌ యువకుడితో పరిచయం ఏర్పడితే.. అతను పెద్ద ఉద్యోగం ఇప్పిస్తానని పాస్‌పోర్ట్‌ కాజేశాడు. ఐదేళ్లుగా ఓ ప్రైవేటు న్యాయవాది వద్ద పనిచేస్తున్నా. తిండి పెట్టి, ఉండటానికి ఒక గది ఇచ్చాడు. భారతదేశానికి తిరిగి రావాలంటే పాస్‌పోర్టు లేదు. చేతిలో సొమ్ములు లేవు’ అని పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడు ఆంధ్రజ్యోతి ప్రతినిధి వద్ద వాపోయాడు.

గల్ఫ్‌ దేశాల్లో ఏం బాగాలేదు

‘గల్ఫ్‌ దేశాల్లో కంపెనీల పరి స్థితి ఏమీ బాలేదు. జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇచ్చేది రూ.20, రూ.30 వేల మించి రావ డం లేదు. పని కూడా ఎక్కువ. నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే చాలా మంది యూరప్‌ దేశాలపై మక్కువ చూపుతున్నారు. అక్కడ నెలకు రూ.70 వేల వరకు వస్తోంది. వాస్తవంగా చూస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇక్కడే బాగున్నాయి. ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుంటే అక్కడికంటే ఇక్కడే ఎక్కువ సంపాదించవచ్చున’ని తణుకుకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ బీహెచ్‌ రామకృష్ణ చెబుతున్నారు.

తణుకు యువకుడు దుబాయ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఏడాదిపాటు అక్కడ ఓ ప్రైవేట్‌ కంపెనీ లో ఉద్యోగం చేశాడు. తర్వాత కెనడా వెళ్లి 90 శాతం మార్కులతో ఎంఎస్‌ పూర్తి చేసి ఏడాది గడిచినా.. ఇప్పటికీ ఉద్యోగం రాలేదు.

గుంటూరు యువకుడు ఏడాదిన్నరగా కెనడాలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీసా గడువు ముగుస్తోంది. పొడిగింపునకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక ఇండియా వచ్చేస్తున్నాడు.

పాలకొల్లు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):

గోదావరి జిల్లాల్లో అమెరికా డ్రీమ్‌ చాలా మంది కల. మా అబ్బాయిని ఉన్నత చదువుల కోసం అమెరికా పం పించా. చదువు పూర్తి చేసుకుని అక్కడే జాబ్‌ చేస్తున్నాడు. మా అమ్మాయికి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశా. వారికి పుట్టబోయే బిడ్డకు అమెరికా సిటిజనే అంటూ చాలా కుటుంబాలు గర్వంగా.. గొప్పుగా చెప్పుకోవడం చూ శాం. వీరిని చూసి మిగిలిన వారు.. తమ పిల్లలను అదే బాట పట్టించాలని ఉవ్విళ్లూరిన వారిని చూశాం. అమెరికా కాకపోయినా, ఆస్ర్టేలియా, కెనడా, బ్రిటన్‌ వంటి దేశాలకు పంపించిన వారూ మన చుట్టూనే ఉన్నారు. ఇలా ఏలూ రు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రతి ఊరి నుంచి ఒకరో, ఇద్దరో అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఉద్యోగాలు, చదు వుల నిమిత్తం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ట్రంప్‌ రాకతో మారిన పరిస్థితులు

అమెరికా సంయుక్త రాష్ర్టాలను స్వర్గధామంగా భావించే మనవాళ్లు.. అక్కడ ఉపాధి పొందడా నికి ఉర్రూతలు ఊగుతారు. ఇది మొన్నటి వరకు వున్న పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా పేరెత్తితే చాలు.. అమ్మో.. అమెరికానా..? అంటూ వెనక డుగు వేస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్య తలు చేపట్టడమే ఇందుకు కారణం. ‘అమెరికానే ఫస్ట్‌’ అంటూ నినాదంతో గెలి చిన ట్రంప్‌.. ఉద్యోగాలు చేస్తున్న అక్రమ వలస దారులపై కొరఢా ఝు ళిపించారు. భారతీ యులు వేలల్లో ఉన్నారని ప్రకటించారు. వీరిలో తొలి విడతగా 104 మందిని మనం తిరిగి పంపించారు. మలి విడతల్లో మరింత మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిలో మన జిల్లావాసులు ఉండే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అమెరికానా.. వద్దులే..!

అమెరికా కలలు కల్లలు అవుతుండడం, అక్కడ చదువు కోసం వెళుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు చదువుకుంటూ పార్ట్‌టైమ్‌ ఉద్యో గాలు చేసుకునే, తమ ఖర్చులకు తామే సంపాదించుకునే వారు. ఇక్కడి నుంచి తల్లిదండ్రులు సొమ్ములు పంపించే అవకాశం ఉండేది కాదు. కాని, ఇప్పు డక్కడ అలాంటి పరిస్థితి లేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంతో పాటు చదువుకున్న తర్వా త వెంటనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. డాలర్‌ డ్రీమ్స్‌ క్రమంగా సన్నగిల్లడంతో ‘అమెరికానా.. వద్దులే’ అనే ధోరణి కనిపి స్తోంది. ఎలాగైనా విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగాలు చేసి, స్థిరపడాలనుకునే వారు అమె రికా తర్వాత ఆస్ర్టేలియా, కెనడా, బ్రిటన్‌, స్వీడన్‌, ప్రాన్స్‌, పోలాండ్‌ వంటి

దేశాలపై మక్కువ చూపేవారు. ఇప్పుడు అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఘణనీయంగా తగ్గిపోవడం, వెళ్లిన వారు ఖాళీగా ఉండడంతో వీటిపైనా ఆసక్తి సన్నగిల్లింది. అదేదో మన దేశంలోనే ఉండి ఇక్కడే చదువుకుందామనే వారి సంఖ్య పెరుగుతోంది.

గల్ఫ్‌ దేశాల మాటేమిటి ?

మన దేశం రూపాయితో పోలిస్తే విదేశీ కరెన్సీ దినార్‌, రీల్‌, పౌండ్‌, డాలర్‌, యూరో విలువ ఎక్కువ. అక్కడ ఒక్కో కరెన్సీ విలువ ఇక్కడ వందతో సమానం..! ఇక్కడ నెల రోజులు కష్టపడితే వచ్చే ఆదాయం అక్కడ అది వారం, పది రోజుల్లోనే సంపాదించవచ్చు. ఇక్కడితో పోలిస్తే అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ కార ణాలతో నిన్న మొన్నటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రతి నెలా వందలాది మంది ప్లంబర్స్‌, టైల ర్స్‌, తాపీ పని వాళ్లు, కారు డ్రైవర్‌, కార్పెంటర్లు, ఎలక్ర్టీషియ న్స్‌, ప్యాక్టరీల్లో పనిచేసే వర్కర్లు, ఇంటి పనుల కోసం దుబా యి, ఖతార్‌, ఒమన్‌, బెహరైన్‌, సౌదీ అరేబియా, మస్కట్‌, కువైట్‌, అబుదాబి వంటి గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు. వీరంతా ఐదారేళ్లు అక్కడే ఉండి రెండు చేతులా సంపాదించుకుని తిరిగి వచ్చేవారు. వీరిని చూసి మిగిలిన వాళ్లు వీరిని అనుకరించేవారు. అయితే వీరి ఆశలను ఏజెంట్లు, దళారులు సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉద్యో గాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడి, విజిటింగ్‌ వీసాలపై పంపించేవారు. అక్కడకు వెళ్లిన వారు ఉపాధి లేక, లక్షలు పోగొట్టుకుని ఇక్కడకు రాలేక చాలామంది జైళ్లలో బందీలుగా మిగిలిన సంద ర్భాలు ఉన్నాయి. ఉపాధికి వెళ్లి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. మరోవైపు అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. పనులు చేసేవారి సంఖ్య పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వల్ల జీతాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ కారణాల రీత్యా లక్షలు ఖర్చు పెట్టుకుని, కుటుంబాలను వదిలి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడడంకంటే ఇక్కడే ఏదొక పని చేసుకోవడం బెటర్‌ అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. దీనితో ఈ మధ్య కాలంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారి సంఖ్య మునుపటిలా లేదు. బాగా తగ్గిపోయింది.

అక్రమంగా వెళ్లారో ఇరుక్కున్నట్టే..!

గల్ఫ్‌తోపాటు అమెరికా, ఆస్ర్టేలియా, బ్రిటన్‌ వంటి దేశాలకు ఉపాధి నిమిత్తం అక్రమంగా వెళితే ఇరుక్కున్నట్టే. దళారులను నమ్మి తగిన పత్రాలు లేకుండా సరిహద్దులు దాటితే.. చిక్కుకుపోతాం. 2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు మధ్య తగిన పత్రాలు లేకుండా యూఎస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 96,917 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు అక్కడి కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. 2020లో ఎనిమిది వేల మంది 2021లో పది వేల మంది, 2022లో 12 వేల మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించింది.

సాఫ్ట్‌వేర్‌పై మోజు వదలాలి

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల మోజు లో ఇతర రంగాల ప్రాముఖ్యతను గుర్తించకపోవడం ఈ పరిస్థితి నెలకొంది. భారతీయ విద్యార్థులు చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలను యూనివర్సిటీ పరిధిని దాటి చేస్తున్న కొందరిని అక్రమ వలసదారులుగా గుర్తించి పంపిస్తున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. భారతీ యుల చదువు, ఉద్యోగాల ఎంపికలో మార్పు రానంత వరకూ ఇక్కడ ఈ సమస్య ఇలానే వుంటుంది. ఇటీవల అమెరికా జారీచేసిన హెచ్‌ 1బీ వీసాలు ఒక్క భారతీయులకే 75 శాతం అందజేసింది. సాఫ్ట్‌వేర్‌కు మించిన అవకాశాలు వున్న రంగాలు చాలా ఉన్నాయి. వాటిపై దృష్టి పెడితే మంచి భవిష్యత్‌ వుంటుంది.

– సాకేత్‌ దేశ్‌ముఖ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, కాలిఫోర్నియా

కొంత కాలం తప్పదు

‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గుర్తింపు కోసమే నిబంధన లు కఠినతరం చేశారు. ఉన్న త విద్యకు అమెరికా వచ్చే మనవాళ్లు గతంలో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసేవారు. ఇప్పుడు దీనిని వారానికి 20 గంటలకు కుదించారు. అదీ యూని వర్శిటీ క్యాంపస్‌కే పరిమితం చేశారు. అయితే ట్రంప్‌ నిర్ణయాలు కొంతకాలమే ఉంటాయి. వలస కార్మికులు ఇక్కడికి రాకుంటే మానవ వనరుల కొరత ఏర్పడుతుం ది. ఇక్కడ ఎంఎస్‌ పూర్తిచేసిన భారత సంతతికి ప్రస్తు తం ఉద్యోగ అవ కాశాలు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్య త్తులో అమెరికా కంపెనీలు అవసరం మేరకు తీసుకోవా లి. లేదంటే అగ్ర రాజ్యం హోదా కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడున్న కఠిన నిబంధనలు ఖచ్చితంగా తొలగిస్తారు. యువకులు విద్య ఉపాధి కోసం సక్రమమైన మార్గంలో వస్తుంటే మరికొందరు తగిన ఎడ్యుకేషన్‌ లేనప్పటికీ అక్రమ పద్ధతుల్లో మెక్సికో మీదుగా అమెరికాలో ప్రవేశి స్తున్నారు. అలాంటి వారినే ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది’ అని తణుకు ప్రాంతానికి చెందిన దావు లూరి జ్యోతి తెలిపారు. 15 ఏళ్ల క్రితం ఆమె అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. భర్త డాక్టరు కాగా, ఆమె సాప్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తున్నారు. అక్కడి పరిస్థితులపై ఆంధ్ర జ్యోతి ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు.

దావులూరి జ్యోతి పెన్సిల్వేనియా స్టేట్‌, మెకానిక్స్‌ బర్గ్‌, అమెరికా

Updated Date - Feb 09 , 2025 | 01:16 AM