పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 35 మంది
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:37 AM
ఉమ్మడి తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో ఉన్నారు.

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
మొత్తం నామినేషన్లు 54
పరిశీలనలో 11 తిరస్కరణ
ఉపసంహరణ 8
ఏలూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన గురువారం సాయంత్రం నాటికి 8 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. మొత్తం 54 మంది అభ్యర్థులు నామినేషన్లు దా ఖలు చేయగా, 11 మంది నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. మరో 8 మంది పోటీ నుంచి నిష్క్రమించారు. నామినేష న్ల మొత్తం ప్రక్రియ ముగియడంతో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే
పేరాబత్తుల రాజశేఖరం(కూటమి అభ్యర్థి), కాట్రు నాగబాబు, షేక్ హుసేన్, కట్టా వేణు గోపాలకృష్ణ, కాండ్రేగుల నరసింహం, కాళ్లూరి కృష్ణమోహన్, కుక్కల గోవిందరాజు, కునుకు హేమాకుమారి, కైలా లావణ్య, గౌతంబాబు కొల్లు, చిక్కాల దుర్గారావు, తాళ్లూరి రమేష్, దత్తాత్రేయ నోరి, దిడ్ల వీర రాఘవులు(ఫీడీఎఫ్), దొరబాబు యాళ్ల, నీతిపూడి సత్యనారాయణ, పినిపే నాగభూషణశర్మ, పిప్పళ్ల సుప్రజ, పేప కాయల రాజేంద్ర, బొడ్డు శ్రీనివాసరావు, బొమ్మన బోయిన వీఎస్‌ఆర్ మూర్తి, బొమ్మిడి సన్నిరాజ్, బండారు రామ్మోహన్‌రావు, భీమేశ్వరరావు చిక్కా, మాకే దేవిప్రసాద్, మెర్ల శాస్త్రులు, మోకన అం బేడ్కర్, రాజ పూడి, జేటీ.రామారావు, రేవులగడ్డ ముఖేష్‌బాబు, వానపల్లి శివగణేష్, ఎం శ్రీనివాస రావు, శ్రీనివాస్ విష్ణువజ్జుల, జీవీ సుందర్, హాసన్ షరీఫ్ బరిలో నిలిచారు.
ఉపసంహరణ అభ్యర్థులు..
గద్దె విజయలక్ష్మి, డాక్టర్ కవల నాగేశ్వరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, బాలాజీ గుండుమోలు, పిళ్లంగోళ్ల లీలా నగేష్, సత్తిరాజు స్వామి, చక్రపాణి.
పట్టభద్ర ఓటర్లు 3,14,984
పోలింగ్ కేంద్రాలు 456
తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు (ప్రస్తుత) ఆరు జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 3,14,984 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. పురుష ఓటర్లు 1,83,347 మంది కాగా, మహిళా ఓటర్లు 1,31,618 మంది ఉన్నారు. మొత్తం 19 మంది ట్రాన్స్‌జె ండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
ఆర్వో వెట్రిసెల్వి
జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేం దుకు అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు. ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత సమక్షంలో పోటీలో నిలిచిన అభ్యర్థులతో వెట్రిసెల్వి గురు వారం సమావేశం నిర్వహించారు. టీవీ, ఇతర సోషల్ మీడియా ప్రచార కోసం మీడియా సర్టిఫి కేషన్ మోనటరింగ్ కమిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. ఏవైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నెంబర్ 1950కు సంప్రదించాలన్నారు. ఏఆర్‌వో వి.విశ్వేశ్వరరావు, ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళి పాటించాలి
ఎన్నికల పరిశీలకురాలు సునీత
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియామవళి పాటించాలని, అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీల కురాలు కె.సునీత సంబంఽధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 70 జోన్లు ఏర్పాటు చేసి, జోనల్ అధికారులను నియమించామని, 95 మంది రూట్ ఆఫీసర్లు విఽధుల్లో ఉంటారన్నారు. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది కి అధికారులు అవసరమైన శిక్షణ అందించా లని సునీత సూచించారు. పటిష్ట బందో బస్తుతో ఏలూరులో కౌంటింగ్ జరుగుతుందని, ఇక్కడే స్ర్టాంగ్‌రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లకు మొదట విడత శిక్షణ పూర్తి చేశామన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఏలూరు నుంచి ఏఆర్‌వో వి.విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో కె.సుబ్బారావు, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయ రాజు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.