ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:56 AM
రానున్న ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

పాలకొల్లు టౌన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రానున్న ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు టీడీపీ కార్యాల యంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజ శేఖరం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, గవర కార్పొ రేషన్ చైర్మన్ ఎం.సురేంద్ర, నియోజకవర్గ పరిశీలకుడు చంద్రమౌళి, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీ కృష్ణంరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం బీఆర్ ఎంవీఎం హైస్కూల్, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లోని యువతను కలిసి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం రాజశేఖరానికి తొలి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.