Share News

Srisailam: బిరబిరా కృష్ణమ్మ

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:58 AM

కృష్ణమ్మ బిర బిరా పరుగులు పెడుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు బుధవారం 70 వేల క్యూసెక్కుల వరద రాగా.. గేట్ల ద్వారా 27 వేలు, జలవిద్యుత్తు ఉత్పాదనతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

Srisailam: బిరబిరా కృష్ణమ్మ

  • ఆల్మట్టి నుంచి జూరాల దాకా తెరుచుకున్న ప్రాజెక్టుల గేట్లు

  • శ్రీశైలంలో 104 టీఎంసీలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): కృష్ణమ్మ బిర బిరా పరుగులు పెడుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు బుధవారం 70 వేల క్యూసెక్కుల వరద రాగా.. గేట్ల ద్వారా 27 వేలు, జలవిద్యుత్తు ఉత్పాదనతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 68 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. గేట్ల ద్వారా 59 వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 52 వేల క్యూసెక్కుల వరద రాగా.. 55వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 58 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 103.89 టీఎంసీల నిల్వ ఉంది.

Updated Date - Jun 26 , 2025 | 04:58 AM