Share News

TDP Party Responsibilities: లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలి

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:19 AM

గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వాషింగ్టన్‌లో జరిగిన మినీ మహానాడులో నారా లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ 102వ జయంతి మరియు సినీ వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.

TDP Party Responsibilities: లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలి

  • వాషింగ్టన్‌ మినీ మహానాడులో తీర్మానం

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పూర్తిస్థాయులో పార్టీ బాధ్యతలు అప్పగించాలని గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు కోరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వర్జీనియా సిటీలో ఆదివారం నిర్వహించిన మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. నారా లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు తీర్మానం చేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌ 102వ జయంతి, సినీ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో భానుప్రకాశ్‌ మాగులూరి, మేరీల్యాండ్‌ పార్టీ ప్రతినిధి రాజా రావులపల్లి, కిశోర్‌ కంచెర్ల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 04:21 AM