Cleanliness స్వచ్ఛతే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:25 PM
Work with Cleanliness as the Goal స్వచ్ఛతే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

పార్వతీపురం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛతే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ పనుల కోసం ఇక్కడకు వచ్చేవారికి కలెక్టరేట్‌లో ఆహ్లాదకర వాతావరణం కనిపించాలన్నారు. ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి.. పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్లు, అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాముల వ్వాలన్నారు. ఇంటి పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో కార్యాలయ పరిసరాలను కూడా అలాగే ఉంచాలని ఆదేశించారు. అనంతరం పారిశుధ్య కార్మికుడు చిరంజీవిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ శోభిక, డీఆర్వో కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చెత్త నుంచి సంపద సృష్టించాలి
జిల్లాలో గృహాల నుంచి సేకరిస్తున్న చెత్తలను తడి, పొడిగా వేరు చేసి వర్మీకంపోస్టుల ద్వారా సంపద సృష్టించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈవోపీఆర్‌డీలు, పంచాయతీ సెక్రటరీలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. పట్టణ, గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎం ఈల సర్వేను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు రోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు.
గ్రామాల్లో పర్యటన..
పార్వతీపురం రూరల్: పెదబొండపల్లిలో చేపట్టిన పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. మురుగు కాలు వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. కొబ్బరి బొండాలు, టైర్లు, సీసాలు, వాటర్ బాటిల్స్ వంటివి నిల్వ లేకుండా చూడాలన్నారు. రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దిబ్బగుడివలసలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. మినీ గోకులాలను సంద ర్శించి వివరాలను లబ్ధిదారుల అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యట నలో డ్వామా పీడీ కె.రామచ్రందరావు, డీపీవో టి.కొండలరావు, డీఎల్‌డీవో రమేష్‌రామన్, తహసీల్దార్ వై.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.