Share News

రఘువర్మను గెలిపించండి

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:07 AM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఉపాధ్యాయులను కోరారు.

రఘువర్మను గెలిపించండి

బెలగాం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం స్థానిక భాస్కర్‌ కళాశాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పాలకొండ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మను ఎమ్మెల్సీగా గెలిపించా లని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులను ఆయన నేరుగా కలిసి కరపత్రాలు అందించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడడం సబబు కాదు

అనంతరం ఆయన విలేకర్లతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ప్రజా సమస్యలపై మాట్లాడమంటే.. ప్రతి పక్ష నాయకుడి హోదా కోసం మాట్లాడడం వైసీపీ అధినే త జగన్‌మోహన్‌రెడ్డికి సబబు కాదన్నారు. 15 నిమిషా లు కూడా అసెంబ్లీలో ఉండకపోవడం దారుణమన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:07 AM