Modern Railway Station మోడ్రన్ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:40 PM
Will Develop into a Modern Railway Station పార్వతీపురం రైల్వే స్టేషన్‌ను మోడ్రన్‌గా తీర్చి దిద్దుతామని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంక్వాల్ తెలిపారు. సోమవారం పార్వతీపురం రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అమృత్ భారత్ ప్రాజెక్టులో ఎంపికైన స్టేషన్‌లో జరు గుతున్న ఆధునికీకరణ పనులు పరిశీలించారు.

బెలగాం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం రైల్వే స్టేషన్‌ను మోడ్రన్‌గా తీర్చి దిద్దుతామని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంక్వాల్ తెలిపారు. సోమవారం పార్వతీపురం రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అమృత్ భారత్ ప్రాజెక్టులో ఎంపికైన స్టేషన్‌లో జరు గుతున్న ఆధునికీకరణ పనులు పరిశీలించారు. కొత్తగా నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జి, రైల్వే ప్రయా ణికుల ఎంట్రన్స్ భవనం పనులపై ఆరా తీశారు. నాలుగో నెంబర్ ప్లాట్ ఫారంపై ఏర్పాటు చేసిన మ్యాప్‌లను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రాజెక్టు అమలు వ్యూహాలపై అధికారులతో చర్చించారు. వెయిటింగ్ హాళ్లు, రైల్వే కార్యాలయాలు, పుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి కొన్ని నెలల్లో పార్వతీపురం స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని జీఎం చెప్పారు. అనంతరం పశ్చిమ రైల్వే కాలనీ, అక్కడ ఏర్పాటు చేసిన పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రన్నింగ్ రూమ్ సిబ్బంది కృషిని గుర్తించారు. మరోవైపు చుట్టుపక్కల కాలనీ వారు తమ సమస్యలపై రైల్వే జీఎంకు వినతిపత్రం ఇచ్చారు. ఈ పరిశీలనలో డీఆర్‌ఎం మనోజ్ కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు.