Share News

Who is eligible for house ఎవరు అర్హులు?

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:09 AM

Who is eligible? ఇళ్లు కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను తేల్చేపనిలో ప్రభుత్వం పడింది. లెక్క పక్కాగా ఉండేలా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కొత్తగా ఇళ్ల నిర్మాణానికి సంసిద్ధంగా వున్న వారికే ఇళ్లు మంజూరు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 21 వేల దరఖాస్తులు రాగా వారిలో అర్హులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరి పరిశీలన పూర్తయ్యాక ఇళ్లు మంజూరు చేస్తారు.

Who is eligible for house ఎవరు అర్హులు?
సర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

ఎవరు అర్హులు?

ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులపై లోతుగా పరిశీలన

జిల్లా వ్యాప్తంగా 21వేల విన్నపాలు

పరిశీలన పూర్తయ్యాక సొంతింటి కల సాకారం

ఇళ్లు కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను తేల్చేపనిలో ప్రభుత్వం పడింది. లెక్క పక్కాగా ఉండేలా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కొత్తగా ఇళ్ల నిర్మాణానికి సంసిద్ధంగా వున్న వారికే ఇళ్లు మంజూరు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 21 వేల దరఖాస్తులు రాగా వారిలో అర్హులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరి పరిశీలన పూర్తయ్యాక ఇళ్లు మంజూరు చేస్తారు.

మెంటాడ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి):

అర్హులందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించగా కొద్దిరోజుల్లోనే భారీ స్పందన కనిపించింది. జిల్లాలో ఇప్పటివరకు 21,140 మంది దరఖాస్తు చేసుకున్నారు. 27 మండలాల నుంచి 19,990 దరఖాస్తులు అందగా, నాలుగు మున్సిపా లిటీల నుంచి 1240 అప్లికేషన్లు చేరాయి. ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజులకే ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందడం అధికార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలకు పెంచుతామని ఎన్నికల హామీల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేదలు ముందుకొస్తున్నారు. ఇదే సమయంలో అర్హులందరికీ సొంతింటి కల నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అర్హులను నిర్ధారించే బాధ్యతను క్షేత్రస్థాయి ఉద్యోగులకు అప్పగించారు. సచివాలయాల సిబ్బంది, హౌసింగ్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సహా మరికొన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయం చేసుకుంటూ తమ పరిధిలోని దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

- దరఖాస్తుదారు ఆర్థిక స్థితి ఏమిటి? గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొంది ఉన్నారా? ఉంటే ప్రస్తుతం ఆ ఇల్లు స్థితి ఏంటి? ఇప్పుడు ఇల్లు మంజూరు చేస్తే సొంతస్థలం ఉందా? ఉంటే ఏ ప్రదేశంలో ఉంది? గ్రామంలోనా, పంట కళ్లం జాగాలోనా? జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరు చేసి ఉంటే....ఆ స్థలం అమ్మకాలు జరిగాయా? ఆ ప్రాంతం ఇంటి నిర్మాణానికి అనుకూలమా? ప్రతికూలమా? తదితర వివరాలను అధికారులు కూలంకషంగా సేకరించను న్నారు. అలాగే దరఖాస్తుదారుది సొంతస్థలమా లేక అక్రమిత స్థలమా అనేదికూడా పరిశీలిస్తారు. దరఖాస్తుదారులు నిజాలు దాచిపెట్టి తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున స్ర్కూటినీ అంశాలకు సంబంధించి తమవద్ద అందుబాటులో ఉన్న పకడ్బందీ సమాచారంతోనే సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి సమగ్ర సర్వే నిర్వహించాక తయారయ్యే అర్హుల జాబితా మేరకు ఇళ్లు మంజూరు చేస్తారు. ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికెట్‌, కులం, ఆదాయ ధ్రువపత్రం, తెలుపు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటి పత్రాలు ఆన్లైన్‌ చేశాక ఇళ్లు మంజూరు చేస్తారు.

- వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరై ఏ కారణంవల్లనైనా నిర్మించుకోలేనివారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సర్కారు యోచిస్తున్నాట్లు సమాచారం. అటువంటి వారికి ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి మంజూరు పత్రాన్ని రద్దుచేసి, అర్హులైతే ఇప్పుడు కొత్తగా ఇల్లు మంజూరు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

- మరోవైపు గ్రామీణంలో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోడానికి నాలుగు లక్షల రూపాయలు మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ముందుగా సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న వారిలో అర్హుల నిగ్గుతేల్చి వారికి మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం సొంత స్థలం లేనివారి విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

కూర్మినాయుడు, పీడీ, గృహ నిర్మాణశాఖ

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 21వేలపైన పక్కా ఇళ్ల కోసం దరఖాస్తులు అందాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తాం.

Updated Date - Feb 14 , 2025 | 12:09 AM